/rtv/media/media_files/2025/04/21/bnAtPkhSSiAY5HMwajbq.jpg)
old faucets
Home Tips: ఇంట్లో బాత్రూమ్ లేదా వంటగదిలో ఉన్న కుళాయిలపై నీటి మరకలు పేరుకుపోవడం చాలా సాధారణం. రోజువారీ వాడకంతో పాటు నీటిలో ఉండే ఖనిజాలు, తుప్పు, సబ్బు మాలిన్యాలు వంటివి కుళాయిలపై స్థిరపడతాయి. ఎంత శుభ్రం చేసినా కొన్ని మొండి మరకలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే దీని పరిష్కారానికి ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు అవసరం లేదు. ఇంట్లో ఉన్న కొన్ని సరళమైన పదార్థాలతోనే కుళాయిలను మెరిసేలా ఉంచుకోవచ్చు. మొదటగా కొవ్వొత్తి వాడకం ఒక వినూత్నమైన చిట్కా. కుళాయి తడిగా ఉన్న సమయంలో మైనపు కొవ్వొత్తిని దానిపై రుద్దడం ద్వారా అది ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది.
సహజ పరిష్కారాలలో..
ఇది నీటి మరకలు లేదా సబ్బు లేయర్లను పేరుకుపోకుండా చేస్తుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేస్తే వెంటనే మెరిసే కుళాయిని చూడవచ్చు. ఇంకా శక్తివంతమైన సహజ పరిష్కారాలలో నిమ్మరసం ముందు వరుసలో ఉంటుంది. నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరకలపై బాగా పని చేస్తుంది. 3-4 నిమ్మకాయల రసాన్ని ఒక కప్పు నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి తడిసిన ప్రాంతాల్లో స్ప్రే చేయండి. ముప్పై నిమిషాలు అలాగే ఉంచి పాత టూత్ బ్రష్‌తో స్క్రబ్ చేసి కాటన్ గుడ్డతో తుడిచేసే సరికి కుళాయి కొత్తలా మెరిసిపోతుంది. మరొక ప్రభావవంతమైన పరిష్కారం తెలుపు వినెగార్.
ఇది కూడా చదవండి: టానింగ్ తొలగించుకోవడానికి సులభమైన పరిష్కారం
ఇది తుప్పు, ఉప్పు నీటికి సంబంధించిన మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. స్ప్రే బాటిల్‌లో వెనిగర్ నింపి కుళాయిపై స్ప్రే చేసి కొన్ని నిమిషాలు ఆగి బ్రష్‌తో స్క్రబ్ చేయండి. చివరగా పొడి గుడ్డతో తుడవడం ద్వారా మెరుస్తుంది. ఇవన్నీ కాకుండా టమాటో సాస్ కూడా మంచి పరిష్కారం. అందులోని సహజ ఆమ్లాలు మరకలను కరుగజేస్తాయి. కొద్దిగా టమాటా సాస్‌ను కుళాయి మీద రాసి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత స్క్రబ్ చేయండి. పొడి గుడ్డతో తుడిచేసిన తర్వాత కుళాయి కొత్తదానిలా మెరుస్తుంది. ఈ సరళమైన చిట్కాలను వారానికి ఒకసారి అనుసరిస్తే కుళాయిలు ఎప్పటికీ మెరిసేలా ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మీకు బాగా దప్పిక వేస్తుందా? అయితే ఆ వ్యాధులు ఉన్నట్లే..!!
( latest-news | home tips in telugu)