/rtv/media/media_files/2025/10/11/radish-leaves-2025-10-11-12-16-53.jpg)
Radish leaves
సాధారణంగా చాలామంది ముల్లంగి దుంపను వంటకు వాడి దాని ఆకులను చెత్తగా భావించి బయట పారేస్తూ ఉంటారు. కానీ ఇకపై ఈ పొరపాటు చేయకండి. ముల్లంగి దుంప మాత్రమే కాదు దాని ఆకులు కూడా పోషకాలతో నిండి ఉంటాయని, అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయని చాలా మందికి తెలియదు. ఈ ముల్లంగి ఆకులు పోషకాల గని. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ కె, సి, ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ముల్లంగి ఆకులు తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ముల్లంగి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:
ముల్లంగి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. ముల్లంగి ఆకులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కారణంగా ఇవి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి, అనవసరమైన బరువు పెరగకుండా నిరోధిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!!
ముల్లంగి ఆకులు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత (Anemia) రోగులకు ఇవి చాలా మేలు చేస్తాయి. ముల్లంగి ఆకులు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. అంతేకాక ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి ఇన్ని అద్భుత పోషక విలువలున్న ముల్లంగి ఆకులను ఇకపై పారవేయకుండా.. వాటిని కూరలు, పప్పులు, లేదా పరాటాలలో చేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పొద్దునే బ్రేక్ ఫాస్టులో ఇవి లాగిస్తే ఆయుష్షు, మెదడు సేఫ్