ఈ లోపాన్ని లైట్ తీసుకున్నారా.. ఇక అంతే సంగతులు

విటమిన్ డి లోపం ఉంటే లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కండరాలు బలహీనంగా మారుతాయి. కాబట్టి డైలీ ఉదయం సూర్యకాంతిలో ఉండటంతో పాటు పాలు, గుడ్లు, చేపలు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Vitamin D Injections

Vitamin D I

మారిన జీవనశైలి వల్ల చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి3 లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ బాడీకి తగ్గితే పూర్తిగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇవే కాకుండా ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విటమిన్ డి3 లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? దీని నుంచి విముక్తి పొందడం ఎలా? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి. 

ఇది కూడా చూడండి:Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్

నాడీ వ్యవస్థపై ప్రభావం

విటమిన్ డి3 లోపం ఏర్పడితే అసలు లైట్ తీసుకోవద్దు. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అలసట
ఈ లోపం ఉంటే రోజంతా చిరాకు, అలసటగా అనిపిస్తుంది. అలాగే బాడీ పెయిన్స్, ఎంత విశ్రాంతి తీసుకున్నా కూడా శరీరానికి ఫ్రీ ఉండదు.

ఇది కూడా చూడండి:Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

కండరాల బలహీనత
విటమిన్ డి3 లోపం వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గుతుంది. 

డిప్రెషన్‌లోకి వెళ్లడం
విటమిన్ డి3 లోపం చివరకు డిప్రెషన్‌కు దారి తీస్తుంది. దీనివల్ల మూడ్ స్వింగ్ మారుతాయి. ఈ లోపం వల్ల ఎల్లప్పుడూ ఏదో కోల్పోయినట్లు విచారంగా ఉంటారు. 

ఇది కూడా చూడండి:Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

బయట పడటం ఎలా అంటే?
ఈ లోపం నుంచి బయట పడాలంటే మాత్రం డైట్‌లో పాలు, గుడ్లు, చేపలు, పెరుగు, వెన్న, పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే డైలీ సూర్యకాంతిలో కొంత సమయం ఉండాలి. అప్పడే మీరు ఈ లోపం నుంచి బయటపడతారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు