/rtv/media/media_files/2025/02/03/cjnahg4eJ2tqZOS16sKD.jpg)
Valentine Week before Valentines Day
Valentines Week 2025: ఈ ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. ఈ నెల అంటే ప్రేమికులకు ఎంతో ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే ఫిబ్రవరి అనేది ప్రేమికుల నెలగా చెప్పుకోవాలి. ఈ నెలలో లవ్ కపుల్ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. వాటికోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు కూడా ఉన్నాయి. దాదాపు వారం రోజుల పాటు ప్రేమికులకు పరీక్షలు ఉంటాయి.
దీనిని వాలెంటైన్ వీక్ అంటారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే.. ప్రియుడు లేదా ప్రేయసి తమతమ మనసులు గెలుచుకోవలసిందే. దీంతో ఇప్పటికే ఈ పరీక్షలకు చాలా మంది సిద్ధమవుతున్నారు. మరి మీరు కూడా అలాంటి చాయిస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే.. ఇక్కడ వాలెంటైన్ వీక్‌కు సరిపడా డేట్ షీట్ అందుబాటులో ఉంది. వాటిని అనుసరించి మీ ప్రియమైన వారికి గిఫ్ట్‌లు ఇచ్చి ప్రేమను వ్యక్తపరచండి.
Valentine Week List
Rose Day
వాలెంటైన్ వీక్ అనేది రోజ్ డేతో స్టార్ట్ అవుతుంది. దీనిని ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమ జంటలు ఒకరికొకరు గులాబీ పువ్వులను లేదా పూల బొకేను ఇచ్చుకుంటారు. దీనికీ ఓ అర్థం ఉంది. గులాబీల తాజాదనం, సువాసన అనేది ప్రేమికుల మధ్య మాధుర్యాన్ని తీసుకువస్తుందని లవ్ కపుల్ నమ్ముతుంది.
Propose Day
ఇప్పటి వరకు ప్రియుడు లేదా ప్రేయసి వెనక పడినవారు తమ ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. ఫిబ్రవరి 8న ప్రేమికులు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఈ రోజున అందమైన గిఫ్ట్‌తో తమలోని ప్రేమను వ్యక్తపరచుకుంటారు.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
Chocolate Day
ఫిబ్రవరి 9న చాక్లెట్ డేను జరుపుకుంటారు. ఈ రోజున జంటలు ఒకరికొకరు చాక్లెట్‌లను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరచుకుంటారు. దీనర్థం చాక్లెట్ డే తమ సంబంధంలో ప్రేమ మాధుర్యాన్ని పెంచుతుందని వారు నమ్ముతారు.
Teddy Day
వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డే. ఈ రోజున ప్రియుడు తన ప్రేయసికి అందమైన టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తాడు. నార్మల్‌గా అమ్మాయిలకు టెడ్డీబేర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి.. ఈరోజును టెడ్డీతో ప్రేమను వ్యక్త పరిచి ఇంప్రెస్ చేయొచ్చు. దీనిని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
Promise Day
ఐదో రోజు ప్రామిస్ డే. ఈ రోజున ప్రేమ జంటలు తమతమ ప్రేమబంధంలో కలిసి కలకాలం ఉండాలని ప్రామిస్ చేసుకుంటారు. ఈ రోజున చేసుకున్న ప్రామిస్‌లను జీవితాంతం పాటిస్తామని వాగ్దానం చేస్తారు. దీనిని ఫిబ్రవరి 11న జరుపుకుంటారు.
Hug Day
వాలెంటైన్స్ వీక్‌లో ఆరవ రోజు హగ్ డే. దీనిని ఫిబ్రవరి 12న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమ జంటలు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల మనసులోని బాధలు, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.
Kiss Day
ప్రేమికులకు ఈ రోజు అంటే ఎంతో ఇష్టం. దీనిని ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. లోతన ప్రేమకు, సాన్నిహిత్యానికి, ఆప్యాయతకు ముద్దు ఒక చిహ్నం. ఇద్దరి భాగస్వాముల మధ్య ముద్దు ఎంతగానో బలోపేతం చేస్తుంది.
Valentine Day
వాలెంటైన్స్ వీక్ చివరి రోజు వాలెంటైన్ డే. ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఒకరినొకరు సమయాన్ని ఇచ్చి తమ బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఇచ్చిన బహుమతులు, హావభావాలతో ప్రేమను ప్రత్యేకంగ వ్యక్త పరుస్తారు.