/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-10.jpg)
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడం అప్పట్లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం కూడా వారానికి 90 గంటలు పనిచేయాలని అనడం దుమారం రేపింది. ప్రస్తుతం పని గంటల అంశం చర్చనీయాంశమవుతోంది. అయితే తాజాగా దీనిపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ప్రస్తుతం అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) చీఫ్‌గా మస్క్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆ బాలీవుడ్ నటుడికి ఫిదా అయిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?
తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు మాత్రం వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే పౌరులు చెల్లిస్తు్న్న సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై DOGE చేస్తున్న ఆడిట్‌లో కీలక విషయాలు బయటపడుతున్నాయని.. ప్రజల డబ్బులు ఎలా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తోందని చెప్పారు.
DOGE is working 120 hour a week. Our bureaucratic opponents optimistically work 40 hours a week. That is why they are losing so fast. https://t.co/dXtrL5rj1K
— Elon Musk (@elonmusk) February 2, 2025
Also read: రూ.12లక్షల దాకా నో ట్యాక్స్ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే: నిర్మలా సీతారామన్
ఇదిలాఉండగా.. డీవోజీఈ ఆడిట్‌లపై ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎలాన్ మస్క్ రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాకా.. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా నిర్వహించేందుకు డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
Also Read: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్