/rtv/media/media_files/2025/02/03/I9AbL5lcYGq2tpgFcXxC.jpg)
Prayag Kumbh Mela
Prayag Kumbh Mela : ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్ష నేతలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శనివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమర్పించిన అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ప్రతిపక్ష పార్టీలు అందుకు ససేమిరా అన్నాయి.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి. ఆ గందరగోళంలోనే వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అసలు మృతుల సంఖ్యపై సరైన స్పష్టత లేదని వారు ఆరోపించారు.
Also Read:Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సంఘటన జరిగిన కొన్ని గంటల వరకు కూడా మరణాలను దృవీకరించకపోవడంపై సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరణాలను దాచిపెడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని, వాస్తవాలను దాచిపెట్టి యోగి సర్కార్ శవరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాగా సభకు ఆటంకం కలిగించడం పట్ల స్పీకర్ ఓం ప్రకాశ్ బీర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
ప్రతిపక్ష పార్టీలకు సభను సజావుగా నిర్వహించడం ఇష్టం లేదని ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందాలనే తప్ప వారికి న్యాయం జరగాలని వారికి లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Gongadi Trisha: టీ-20 మ్యాచ్ మ్యాచ్ గెలిపించిన గొంగడి త్రిష.. సీఎం రేవంత్ ఏమన్నారంటే ?