Tirumala: నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రితో ముగియనున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. అర్థరాత్రి 12 గంటలకు ఏకాంత సేవతో తలుపులను మూయనున్నారు. మళ్లీ డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారాలు తెరుచుకుంటాయి.