Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

అనంతపురంలో ఈరోజు జరగనున్న బాలయ్య డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చిత్ర యూనిట్, నందమూరి బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update

Daaku Maharaaj:  బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో  భారీగా ప్లాన్ చేయగా.. క్యాన్సిల్  అయ్యింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఈవెంట్ జరపడం సరికాదని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రీ రిలీజ్ పై మేకర్స్ పోస్ట్.. 

తిరుపతిలో జరిగిన విషాద ఘటనకు మా చిత్ర యూనిట్ అంతా ఎంతో బాధపడుతోంది. పవిత్ర దేవస్థానంలో ఇలాంటిఘటన జరగడం హృదయ విదారకం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ జరపడం సరికాదని భావిస్తున్నాం.  బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో  ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని చిత్రబృందం పోస్ట్ పెట్టింది. 

అయితే నిన్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం టోకెన్లు తీసుకునే క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. దీనిపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలు అందరికీ సానుభూతి తెలియజేశారు.  ఏపీ ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు