/rtv/media/media_files/2025/01/08/yy1JjHlNiQ96DN7jfOZk.jpg)
ekadasi
Vykunta Ekadasi 2025: హిందువులకు ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వచ్చేసింది. ఈ ఏకాదశి తిథి రోజు భక్తితో మహా విష్ణువును పూజించి, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అయితే కేవలం విష్ణు ఆలయాల్లోనే కాకుండా ప్రతీ ఆలయంలో కూడా నేడు ఉత్తర ద్వారా దర్శన అవకాశం ఇస్తారు. ఏడాది మొత్తంలో ఈ వైకుంఠ ఏకాదశిని చాలా పవిత్రంగా చూస్తారు.
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే
నెయ్యితో దీపం వెలిగించి..
ఈ ఏకాదశి తిథి నాడు విష్ణువును దర్శించుకుంటే.. మోక్షం లభిస్తుందని పండితులు అంటుంటారు. అయితే ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో ఈ విధంగా పూజ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు వేకువ జామున లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో విష్ణువు పటానికి పూజించి, నెయ్యితో దీపం వెలిగించాలి.
ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !
ఆ తర్వాత తెల్ల గన్నేరు, నంది వర్థనం, తుమ్మి పూలు, జాజాపూలతో పూజించి పాయసం వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఏకాదశి తిథి ఉన్న సమయంలో ఉపవాసం ఉండాలి. ద్వాదశి తిథి వచ్చిన తర్వాత ఆలయాన్ని సందర్శించి ఉపవాసం విడవాలి. నేడు మాంసాహారం, వెల్లుల్లి, మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మోక్షం లభించకుండా పాపం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు