/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope Today
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : శారీరక కలయిక తరువాత అక్కడ నొప్పి రావడానికి విటమిన్ లోపం కారణమని తెలుసా..?
మేషం
మీరు మొదలుపెట్టిన పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు, బంధువుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. మీ ఇష్టదైవం స్తోత్రం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
మీరు మొదలుపెట్టిన పనులను బాధ్యతగా చేసి, మంచి ఫలితాలను పొందుతారు. ఒక ముఖ్యమైన సమస్యను తెలివిగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వాదం మీకు మేలు చేస్తుంది.
మిథునం
ముఖ్యమైన పనుల్లో మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పిల్లలకు సంబంధించి ఒక మంచి వార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం మంచిది.
కర్కాటకం
ఎక్కువగా కష్టపడకుండా చూసుకోండి. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్నిస్తుంది. మీకు దగ్గరైన వారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామం జపిస్తే మంచి జరుగుతుంది.
సింహం
మీరు మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చినా, దేవుడి దయతో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. నెమ్మదిగా పురోగతి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభాన్నిస్తుంది.
కన్య
మంచి ఆలోచనలతో మీరు అనుకున్నది సాధిస్తారు. చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సరైన సమయానికి తినడం, నిద్రపోవడం తప్పనిసరి. చంద్ర అష్టోత్తరం చదవడం మంచిది.
Also Read : కారుప్రయాణాల్లో వాంతులు ఎందుకొస్తాయో తెలుసా..? ఈ సింపుల్ నివారణాలు తెలుసుకోండి!!
తుల
గ్రహబలం మీకు అనుకూలంగా ఉంది. మీరు మీ రంగాలలో బాగా రాణించి విజయం సాధిస్తారు. ఇతరులకు సహాయపడే పనులు చేస్తారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం.
వృశ్చికం
మీ రంగాలలో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఏ పని మొదలుపెట్టినా దాన్ని సులభంగా పూర్తిచేస్తారు. మీరు అనుకున్నది నెరవేరుతుంది. స్నేహితుల సహాయం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులకు ఇది మంచి సమయం. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుడిని పూజించడం మానవద్దు.
ధనుస్సు
ముఖ్యమైన విషయాలలో ఆలోచించి అడుగు వేయాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. మీ బంధువులు, స్నేహితుల వల్ల మీకు మేలు జరుగుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మకరం
మీరు మొదలుపెట్టిన పనుల్లో చిన్న సమస్యలు ఎదురైనా, వాటిని పూర్తిచేయగలుగుతారు. మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పనులలో మీరు తొందరపాటుతో వ్యవహరిస్తారు. విష్ణు నామాన్ని స్మరించుకోవడం ఉత్తమం.
కుంభం
స్థిరమైన బుద్ధితో ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు. వ్యాపారంలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం అవసరం. సరైన సమయంలో మీకు సహాయం చేసేవారు ఉంటారు. శివారాధన చేయడం మంచిది.
మీనం
మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.