Cockroaches: వర్షాకాలంలో పురుగుల బెడద ఉందా..? ఇలా ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి

వర్షాకాలంలో ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బొద్దింకలను తరిమి కొట్టాలంటే నిమ్మరసం, బేకింగ్ సోడా, వేప నూనె, కర్పూరం, ఉల్లిపాయ, లవంగ నూనె స్ప్రే చేయాలి. ఈ చిట్కాలతో పురుగులబెడద లేకుండా ఇంటిని ప్రశాంతంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు.

New Update
Cockroaches

Cockroaches

Cockroaches: వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇళ్లు పురుగుల దాడు చేస్తాయి. వర్షపు నీటితోపాటు కొన్ని కీటకాలు, పురుగులు ఇంటి లోపలికి వచ్చేస్తాయి. ఇవి ఒక్కోసారి మనకు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. అంతేకాకుండా వాటి వల్ల ఇంట్లో దుర్వాసన కూడా వస్తుంది. సాధారణంగా ఇలాంటి వాటిని తరిమికొట్టేందుకు రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడుతుంటారు. కానీ అవి మన ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశముంది. అయితే అలాంటి రసాయనాలు వాడకుండా ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో కూడా పురుగుల బెడదను తగ్గించుకోవచ్చు. వాటిల్లో ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా బొద్దింకలు మురికిగా ఉండే ప్రదేశాల్లో గుడ్లు పెట్టి వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అయితే వాటిని పూర్తిగా నాశనం చేయడానికి, నివారించడానికి వంటింట్లో ఉండే వస్తువులను వాడొచ్చు. కొన్ని చిట్కాలను పాటిస్తే ఇల్లు బొద్దింకలు లేని పరిశుభ్రమైన ప్రదేశంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, బొద్దింకలను  తరిమికొట్టడానికి కొన్ని సులువైన ఇంటి చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇంట్లో బొద్దింకలు తరిమికొట్టే చిట్కాలు:

నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకొని ఇంట్లో పురుగులు ఎక్కువగా ఉండే చోట పిచికారీ చేయాలి. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్, బెడ్‌రూమ్‌లలో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేప నూనెలో సహజంగానే పురుగులను తరిమికొట్టే గుణాలు ఉంటాయి. వేప నూనెను నీటిలో కలిపి ఇంట్లో పురుగుల బెడద ఎక్కువగా ఉన్నచోట స్ప్రే చేయవచ్చు. కర్పూరం వాసన కూడా పురుగులను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. మీరు ఇంట్లో కొన్ని మూలల్లో కర్పూరం బిళ్ళలు పెట్టినా లేదా కర్పూరం నూనెను స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ టీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా..? వాస్తవాలు తెలుసుకోండి

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ పదార్థాలు పురుగులకు అస్సలు నచ్చవు. అందువల్ల ఉల్లిపాయ ముక్కలు కోసి పురుగులు వచ్చే ప్రదేశాల్లో పెడితే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. లవంగ నూనె వాసన పురుగులను తరిమికొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ నూనెను కొన్ని నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే పురుగుల బెడద లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.!!

Advertisment
తాజా కథనాలు