/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-16-22.jpeg)
నేటి కాలంలో ఆహారపు అలవాట్లు ఎక్కువ ఆనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టీ మాచా టీ ఒకటి. దానిని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-16-36.jpeg)
మితమైన మాచా టీ వినియోగం గర్భం కోసం ప్రయత్నిస్తున్న వారికి సురక్షితమే. మాచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మాచాలో కెఫీన్ కూడా ఉంటుంది. రోజుకు 200 నుంచి 400 మి.గ్రా కెఫీన్ను మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-16-48.jpeg)
ఇది సుమారు ఒకటి నుంచి రెండు కప్పుల గ్రీన్ టీ మాచాటీకు సమానం. అయితే అధిక మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-16-58.jpeg)
అధిక కెఫీన్ మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది అండం విడుదలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. పురుషులలో అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత, చలనం, సంఖ్య తగ్గుతాయి.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-17-08.jpeg)
గర్భిణీ స్త్రీలు, గర్భం కోసం ప్రయత్నిస్తున్నవారు రోజుకు 200 మి.గ్రా మించి కెఫీన్ తీసుకోకూడదని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. మాచా టీలో ఉండే కెఫీన్ను కూడా ఈ పరిమితిలో లెక్కించాలి.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-17-18.jpeg)
మాచా టీని రోజుకు ఒకటి, రెండు కప్పులకు పరిమితం చేసుకోవడం మంచిది. మీ ఆహారం, కెఫీన్ వినియోగం గురించి ఏదైనా సందేహం ఉంటే వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మంచిది.
/rtv/media/media_files/2025/08/09/matcha-tea-2025-08-09-20-17-29.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.