/rtv/media/media_files/2025/04/27/A3ZzE4eXHs6hiaNsTKPz.jpg)
low water content
శరీరానికి తగినంత నీరు అందించాలి. ఆహారం తీసుకోకుండా అయినా.. కొన్ని రోజులు ఉండగలమేమో కానీ, నీళ్లు తాగకుండా వేసవిలో ఎక్కవ సేపు ఉండలేం. అసలే వేసవి.. సాధరణ రోజుల్లో కంటే ఎండాకాలంలో కస్త ఎక్కవ నీళ్ళు తాగాలి. పురుషులు అయితే రోజుకు 3.7 లీటర్ల నీళ్లు తాగాలి. అదే స్త్రీలు 2.7 లీటర్ల నీళ్లు తాగాలి. శరీరంలో 60శాతం వాటర్ ఎప్పుడు ఉండేట్లు చూసుకుంటే మన ఆరోగ్యం సురక్షితం. మీ బాడీలో వాటర్ పర్సెంట్ తగ్గింది అంటే అది మీకు చాలా డేంజర్. డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తోంది. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. మీరు రోజు పని హడావిడిలో పడి సరిగ్గా నీళ్లు తాగరు. మీ శరీరంలో వాటర్ పర్సెంట్ తక్కువగా ఉందంటే మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
Also Read : కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు
Low Water Content In Body
దాహం: ఇది బాడీకి లిక్కిడ్స్ అవసరం అని చెప్పే ఓ ప్రాథమిక సంకేతం.
పసుపు రంగులో మూత్రం: మీరు రోజూ సరిపడ నీళ్లు తాగట్లేదంటే.. మీ యూరిన్ ముదురు పసుపు రంగులో వస్తోంది. అలాగే మూత్రం తక్కువగా కూడా వస్తోంది.
నోరు, పెదవులు పొడిబారడం: డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడం, పెదవులు పొడిబారడం, పగిలిపోవడం జరుగుతుంది.
అలసట, బలహీనత: హైడ్రేషన్ లేకపోవడం వల్ల అలసట, సాధారణ బలహీనత కలుగుతుంది.
తలతిరగడం: నిర్జలీకరణం రక్తపోటును ప్రభావితం చేస్తుంది. తలతిరగడం లేదా తలతిరగడానికి దారితీస్తుంది.
తలనొప్పి: సాధారణ తలనొప్పి అనేది డీహైడ్రేషన్ మొదటి లక్షణం.
పొడి చర్మం: నిర్జలీకరణం వల్ల చర్మం పొడిగా, నీరసంగా మారుతుంది.
కండరాల తిమ్మిరి: నిర్జలీకరణం కండరాల తిమ్మిరి మరియు దుస్సంకోచాలకు దోహదం చేస్తుంది.
చిన్న పిల్లల్లో అయితే వాటర్ శాతం తక్కువంటే ఏడుస్తున్నప్పుడు కనీళ్లు రావు.
Also Read : ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగితే గుండె పోటు.. షాకింగ్ విషయాలు!
Also Read : పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫోటో.. ఇదెక్కడి అభిమానం రా సామీ!
(telugu-health-tips | water content | symptoms | dehydrate | dehydration | summer-tips | latest-telugu-news)