Celebrity Couple కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు

బుల్లితెర ఫేమ్ నటి కిష్వర్ మర్చంట్‌, నటుడు సుయాష్ రీల్ లైఫ్ లో తల్లీకొడుకులుగా నటించి.. రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారారు. కిష్వర్ తనకంటే 8ఏళ్ళు చిన్నవాడిని పెళ్లి చేసుకోవడం అందరినీ సర్ప్రైజ్ చేసింది.

New Update
Kishwer Merchant Suyyash Rai

Kishwer Merchant Suyyash Rai

Celebrity Couple సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల  పెళ్లిళ్లు చేసుకోవడం కొత్తేమీ కాదు. సినిమా లేదా సీరియల్  సమయంలో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారి పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రెటీ జంటలు  చాలానే ఉన్నారు. ప్రస్తుతం కొందరు వారి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు బేధాభిప్రాయాలతో విడాకుల బాట పట్టారు.  అయితే  ఇప్పుడు..  ఇలాంటి ఓ  సెలెబ్రెటీ కపుల్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. రీల్ లైఫ్ లో తల్లీకొడుకులుగా నటించారు.. రియల్ లైఫ్ లో భార్యాభర్తలు గా మారారు. ఈ స్టోరీ మరెవరిదో కాదు ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్‌, నటుడు  సుయాష్ రాయ్‌ లది. 

Also Read :  MI vs LSG: చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్

తల్లీకొడుకులుగా

 'ప్యార్ కి యే ఏక్ కహానీ' అనే హిందీ టీవీ సీరియల్ లో నటి కిష్వర్ మర్చంట్‌ తల్లీ పాత్రలో నటించగా.. ఆమె కొడుకు పాత్రలో సుయాష్ నటించారు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అది కాస్త పెళ్లి పీటల వరకు వెళ్ళింది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన సుయాష్ పెళ్లి చేసుకోవడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. 

Also Read: Heart Attack: ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగినే గుండె పోటు.. షాకింగ్ విషయాలు!

2016లో పెళ్లి 

అయితే ముందుగా నటుడు సుయాష్ ఇంట్లో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదట. కాబోయే కోడలు కొడుకు కంటే వయసులో పెద్దదని వ్యతిరేకించారట సుయాష్ ఫ్యామిలీ. కానీ.. సుయాష్ , కిష్వర్ తమ ప్రేమకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తూ.. 2016లో పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. ఆ వీరిద్దరూ భారీ ట్రోలింగ్ కి గురయ్యారు. ఇద్దరి మధ్య వయసును ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఇవేవి పట్టించుకోకుండా హ్యాపీగా జీవితాన్ని ముందుకు సాగించారు సుయాష్ - కిష్వర్. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. 

telugu-news | latest-news | cinema-news

Also Read :  నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

Advertisment
తాజా కథనాలు