/rtv/media/media_files/2025/04/27/7K7iHXnvtPpvnFoFOyzX.jpg)
plastic bottle water cause heart attack
Health ప్రస్తుత జనరేషన్ లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీసుల్లో, మీటింగ్స్ లో లేదా ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లను ప్రిఫర్ చేస్తున్నారు. ఇది చాలా సులభంగా, సౌకర్యవంతంగా మారింది. కానీ ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయమేంటంటే ప్లాస్టిక్ బాటిళ్లల్లో నీరు తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని!. దీని వల్ల మిలియన్ల మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
అయితే తాజా పరిశోధనలో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లోని కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.
Also Read : మహేష్ బాబు ఈడీ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన లేఖ రాసిన హీరో!
గుండెపోటుకు ఎలా కారణం..
అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో BPA, థాలెట్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని సహజ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి అసాధారణమైన రక్తపోటును కలిగించి.. గుండెపోటు ప్రమాదానికి దారితీస్తుంది. అంతేకాదు ప్లాస్టిక్ బాటిళ్లలోని రసాయనాలు వల్ల హార్ట్ వాళ్ళు కుచించుకుపోతాయి. తద్వారా రక్తప్రవాహానికి ఆటంకం కలిగి.. గుండెపోటుకు కారణమవుతుంది.
అలాగే మరికొన్ని అధ్యయనాల ప్రకారం.. BPA (bisphenol A) కెమికల్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి.. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడతాయని కనుగొన్నారు. ఈ పరిస్థితి కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read : 'ఇండియాలోని ఆ ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం'
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
- ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు చేసేటప్పుడు BPA లేని బాటిళ్లను తనిఖీ చేసి కొనండి.
- ఒకే బాటిల్ ని సంవత్సరాలుగా ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల బాటిల్ నాణ్యత తగ్గిపోయి.. ప్లాస్టిక్ కణాలు లీక్ అవడం మొదలవుతుంది.
- ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా స్టెయిన్ లెస్ స్టీల్, కాపర్ బాటిల్స్ వాడడం ఉత్తమమైన ఎంపిక
- ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు.. గాజు, లేదా స్టీల్ బాటిల్ లో నీళ్లు క్యారీ చేయడం అలవాటు చేసుకోండి. దీని వల్ల బయట ప్లాస్టిక్ బాటిళ్లు కొనే అవసరం ఉండదు.
- ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా స్టెయిన్ లెస్ స్టీల్, కాపర్ బాటిల్స్ వాడడం ఉత్తమమైన ఎంపిక
Also Read : ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగితే గుండె పోటు.. షాకింగ్ విషయాలు!
telugu-news | life-style | latest-news | plastic-bottle-water
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫోటో.. ఇదెక్కడి అభిమానం రా సామీ!