Summer Tips: వేసవిలో హోమ్‌మెడ్ ఫేస్ ప్యాక్స్.. మొహం మిలమిలా మెరిసిపోతుంది!

వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల చర్మం పొడిబారడం, టాన్నింగ్ , చికాకుగా అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే ఇంటిలోనే తక్కువ ఖర్చుతో సహజ పదార్థాలతో తయారుచేసే ఫేస్ ప్యాక్స్‌ వాడితే ఈ సమస్యలను తగ్గించవచ్చు 

New Update
Skin Care..

Summer Tips: వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల చర్మం పొడిబారడం, టాన్నింగ్ , చికాకుగా అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే ఇంటిలోనే తక్కువ ఖర్చుతో సహజ పదార్థాలతో తయారుచేసే ఫేస్ ప్యాక్స్‌ వాడితే ఈ సమస్యలను తగ్గించవచ్చు 

కస్తూరి పసుపు – తేనె ఫేస్ ప్యాక్

కావాల్సినవి:  కస్తూరి పసుపు – 1 టీస్పూన్, తేనె – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఈ రెండింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేయండి.
దీని వల్ల  చర్మం మృదువుగా మారుతుంది, ముడతలు తగ్గుతాయి.

Also Read :  నాభిలో నూనె రాయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అలోయ్‌వెరా – నిమ్మరసం ఫేస్ ప్యాక్

కావాల్సినవి: ఆలోయ్‌వెరా జెల్ – 2 టీస్పూన్లు, నిమ్మరసం – 1 టీస్పూన్

తయారీ విధానం: రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడగండి.ఇలా చేయడం వల్ల చర్మంలోని  మలినాలను తొలగిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

 కీరా – పెరుగు ఫేస్ ప్యాక్

కావాల్సినవి: కీరా గుజ్జు – 2 టీస్పూన్లు, పెరుగు – 1 టీస్పూన్

తయారీ విధానం: రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తుడిచేయండి. ఇది చల్లదనం  కలిగిస్తుంది, చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

ఇది కూడా చదవండి: ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి

వేసవిలో  చర్మ సంరక్షణకు సూచనలు

  • రోజుకు  రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేయండి
  • ఎక్కువగా నీరు త్రాగండి
  • బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడండి
  • సింథటిక్ కాస్మెటిక్స్‌కు బదులుగా సహజ పదార్థాలను ఉపయోగించండి

Also Read :  సరదాగా తీసుకునే స్నాక్స్‌తో డేంజర్ సమస్యలు.. కారణాలు ఇవే

latest-news | telugu-news | life-style | skin-care | summer-tips

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు