Steady State Cardio vs HIIT: బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

స్టెడీ స్టేట్ కార్డియో, HIIT రెండూ బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడే వ్యాయామాలు. HIIT అధిక ఒత్తిడితో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇస్తే, స్టెడీ కార్డియో తక్కువ ఒత్తిడితో మంచి ఫలితాలను ఇస్తుంది. మీ లక్ష్యం ఆధారంగా వ్యాయామాన్ని ఎంచుకోవాలి.

New Update
Steady State Cardio vs HIIT

Steady State Cardio vs HIIT

Steady State Cardio vs HIIT: ఆరోగ్యవంతమైన జీవితం కోసం వ్యాయామం(Exercise) అనేది చాలా అవసరం. బిజీ లైఫ్ , జాబ్ టెన్షన్స్ వల్ల చాల మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదు. మరీ ముఖ్యంగా యువత వ్యాయామనికి(Workouts) దూరం అవుతున్నారు. గుండె ఆరోగ్యం(Heart Health) బాగుండాలన్నా, మానసిక, శారీరిక ఆరోగ్యం బాగుండాలన్నా వ్యాయామం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే ఈ వ్యాయామం అనేది ఒక్కటే రకం కాదు వివిధ రకాలలో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడం(Weight Loss), హార్ట్ ఆరోగ్యం మెరుగుపరచడం లేదా బలమైన శరీరాన్ని పొందాలనుకునే  వారికి రెండు రకాల వ్యాయామ మార్గాలు ఉన్నాయి.

  1. స్టెడీ స్టేట్ కార్డియో (Steady-State Cardio)  
  2. హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ (HIIT). 

Also Read: అలర్ట్! ఇవి పాటించకపోతే మీ గట్ హెల్త్ షెడ్డుకే..!

అయితే ఈ రెండు మధ్య తేడా ఏమిటి? మీకు ఏది సరైనది?

స్టెడీ స్టేట్ కార్డియో అంటే ఏమిటి? (What is Steady State Cardio ?)

స్టెడీ స్టేట్ కార్డియో అనేది కొంచెం తక్కువ వేగంతో, స్థిరమైన రీతిలో ఎక్కువ సమయం పాటు చేసే వ్యాయామం. ఉదాహరణకు, 30–60 నిమిషాలపాటు నడక, జాగింగ్, తక్కువ వేగంతో సైక్లింగ్ వంటివి ఇందులోకి వస్తాయి. ఇది ఎక్కువ సేపు శరీరాన్ని కదలికలో  ఉంచడం వల్ల క్యాలరీలను మెల్లగా, నిరంతరంగా కరిగిస్తుంది.

ఈ వ్యాయామం ప్రారంభ దశలో ఉన్నవారికి, లేదా కీళ్ల నొప్పులు, ఆరోగ్య పరిమితులు ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ ఒత్తిడిని కలిగిస్తూ, గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Also Read:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

HIIT అంటే ఏమిటి?(What is HIIT ?)

HIIT అంటే High-Intensity Interval Training. దీంట్లో కొన్ని నిమిషాలపాటు వేగంతో వ్యాయామం చేసి, మధ్యలో చిన్న విశ్రాంతి తీసుకుంటారు. ఉదాహరణకు, 30 సెకన్లపాటు వేగంగా వ్యాయామం చేసి, ఆపై 30 సెకన్ల విశ్రాంతి తీసుకోవడం - ఇలా 15–20 నిమిషాలు చేయాలి.

HIIT ప్రత్యేకత ఏమిటంటే - ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. అలాగే ఇది Afterburn Effect ను కలిగిస్తుంది, అంటే వ్యాయామం అయిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు శరీరం క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరం.

Also Read: Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

Steady State Cardio vs HIIT

క్యాలరీ ఖర్చు: HIIT తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తుంది. స్టెడీ స్టేట్ దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యం(Heart Health): రెండింటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, కానీ HIIT గుండెను మరింత శక్తివంతం చేస్తుంది.

మెటబాలిజం(Metabolism): స్టెడీ స్టేట్ కంటే HIIT మెటబాలిజాన్ని ఎక్కువ వేగవంతం చేస్తుంది. 

స్ట్రెస్సు లెవెల్(Stress Levels): స్టెడీ స్టేట్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. HIITలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది.

గాయాలు(Injuries): HIITలో తప్పుడు ఫార్మ్ వల్ల గాయాలయ్యె అవకాశాలు ఉంటాయి. స్టెడీ స్టేట్ లో గాయాలు అయ్యే అవకాశం చాలా తక్కువ.

Also Read:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

మీకు ఏది సరైనది?

మీ లక్ష్యం ఆధారంగా వ్యాయామ పద్ధతిని ఎంచుకోవాలి. బరువు తగ్గడానికి చూస్తూ మీకు టైం తక్కువ ఉన్నట్లయితే - HIIT ఉత్తమం. నెమ్మదిగా ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి, వ్యాయామాలను కొత్తగా మొదలు పెట్టినవారికి  - స్టెడీ స్టేట్ కార్డియో మంచిది.

అయితే, మరింత మంచి ఫలితాలు కావాలంటే ఈ రెండింటినీ కలిపి  చేస్తూ వారంలో కొన్ని రోజులు HIIT, మరికొన్ని రోజులు స్టెడీ కార్డియో చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు. శరీరానికి మార్పు, విశ్రాంతి, బ్యాలన్స్ అవసరం. వ్యాయామాన్ని మీ జీవితశైలికి తగ్గట్టుగా మార్చుకోవడం వల్ల దీర్ఘకాల ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇటువంటి వ్యాయామాలు ఏదైనా ఎంచుకునే ముందు మీ శారీరక స్థితి, ఆరోగ్య పరిమితులు, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడూ నెమ్మదిగా ప్రారంభించి, నిపుణుల సలహాతో ముందుకెళ్లడం మంచిది. శ్రద్ధగా, సరైన పద్ధతిలో చేసే వ్యాయామమే మీ శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా మార్చగలదు!

NOTE:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు