Smart Phone: స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడుపుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు గంట కంటే ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపినట్లయితే మయోపియాతో బాధపడవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. మయోపియా అనేది ఒక తీవ్రమైన కంటి వ్యాధి. దూరంలో ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంది. స్క్రీన్ సమయం వల్ల కలిగే హానిని మూడు లక్షలకుపైగా వ్యక్తులపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
మెదడును దెబ్బతీస్తోంది:
ఈ అధ్యయనంలో ఒక వ్యక్తి రోజుకు గంట కంటే ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్‌పై గడిపితే దగ్గరగా ఉన్న వస్తువులను చూడగల కళ్ల సామర్థ్యం తగ్గుతుందని కొనుగొన్నారు. అయితే స్క్రీన్ సమయాన్ని గంటకు మించి పెంచుకుంటే మయోపియా ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. చికిత్స అందించడంలో వైద్యులకు ఈ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పిల్లల నుండి యువకుల వరకు 3.35 లక్షలకు పైగా పాల్గొనేవారిలో స్క్రీన్ సమయం, దృష్టి మధ్య సంబంధాన్ని కనుగొన్న 45 అధ్యయనాల నుండి డేటాను నిపుణులు సమీక్షించారు.
ఇది కూడా చదవండి: హిందువులు ఈ జంతువుల మాంసాన్ని తినకూడదు
స్క్రీన్ ఎక్కువసేపు చూస్తే కళ్లను ప్రభావితం చేయడమే కాకుండా మెదడు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. ఎక్కువ స్క్రీన్ సమయం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. స్క్రీన్ సమయాన్ని 1 నుండి 4 గంటలకు పెంచడం వల్ల కళ్లు దెబ్బతినే ప్రమాదం పెరగడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పుచ్చకాయలు పిచ్చి పిచ్చిగా తింటున్నారా.. ఇది తెలిస్తే పుచ్చలేసిపోద్ది!!