Watermelons: వేసవికాలం వచ్చిందంటే ప్రజలు పుచ్చకాయలు కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. దీంతో కొందరు పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కృత్రిమ రంగులను ఇంజెక్ట్ చేస్తున్నారు. దీంతో పుచ్చకాయను కోసినప్పుడు అది చాలా ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల్లో పుచ్చకాయలకు రసాయన రంగు వేస్తున్నారనే ఆరోపణలతో ఫుడ్‌సేఫ్టీ అధికారులు వాటి నమూనాలను సేకరిస్తున్నారు. కృత్రిమ రంగులు, రసాయనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపడం ఖాయం.
రసాయన పుచ్చకాయను ఎలా గుర్తించాలి?
ఒక చిన్న పుచ్చకాయ ముక్కను నీటిలో కలపండి. నీరు గులాబీ రంగులోకి మారుతుందో లేదో గమనించండి. నీరు గులాబీ రంగులోకి మారితే అది రసాయన పుచ్చకాయ. పండు లోపల టిష్యూ పేపర్‌తో అద్దాలి. కాగితం ఎర్రగా మారితే అది కల్తీ పుచ్చకాయ అని అర్థం.
రసాయనాలు కలిపిన పుచ్చకాయ తింటే ఏమవుతుంది?
రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. రసాయన పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. రసాయనాలతో కూడిన పుచ్చకాయ తినడం వల్ల సరైన సమయంలో ఆకలిగా అనిపించదు. సరైన సమయంలో తినలేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. రసాయనిక రంగు వేసిన పుచ్చకాయ తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చెవిలోని గులిమిని సహజంగా తొలగించే చిట్కాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హిందువులు ఈ జంతువుల మాంసాన్ని తినకూడదు