Glowing Skin Soup: నిగనిగలాడే మేని ఛాయ కోసం అదిరి పోయే సూప్!!

చర్మం అద్దంలా మెరిసిపోవాలంటే.. బీట్‌రూట్, క్యారెట్, అల్లం, నిమ్మకాయ శక్తితో కూడిన ఈ గ్లోయింగ్ స్కిన్ సూప్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఆరోగ్యకరమైన సూప్ అందాన్ని పెంచడమే కాక.. రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Glowing Skin Soup

Glowing Skin Soup

ప్రతిరోజూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం.. ఖరీదైన ఉత్పత్తులు వాడటం కంటే.. లోపలి నుంచి కాంతిని పెంచడం ఉత్తమం. చర్మం అద్దంలా మెరిసిపోవాలంటే.. బీట్‌రూట్, క్యారెట్, అల్లం, నిమ్మకాయ శక్తితో కూడిన ఈ గ్లోయింగ్ స్కిన్ సూప్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఆరోగ్యకరమైన సూప్ అందాన్ని పెంచడమే కాక.. రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

సూప్ ప్రయోజనాలు:

బీట్‌రూట్: ఇందులో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి సహజమైన గులాబీ రంగును ఇస్తుంది.
క్యారెట్: విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.
అల్లం, నిమ్మకాయ: ఇవి శక్తివంతమైన డిటాక్సిఫైయర్‌లుగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇది కూడా చదవండి: మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం వెనుక దాగున్న వాస్తవాలు ఇవే!!

గ్లోయింగ్ స్కిన్ సూప్ కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ 1 మీడియం సైజు ముక్కలు క్యారెట్ 2 ముక్కలు, టొమాటో 1, అల్లం 1 అంగుళం ముక్క నల్ల మిరియాల పొడి రుచికి సరిపడా
రాక్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం 1 టీస్పూన్,  కొద్దిగా నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ అన్ని సిద్దంగా పెట్టుకోవాలి.
తర్వాత ప్రెషర్ కుకర్‌లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి అల్లాన్ని వేసి కొద్దిగా వేయించాలి. తరువాత బీట్‌రూట్, క్యారెట్, టొమాటో ముక్కలను వేసి రెండు కప్పుల నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లార్చి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి దాన్ని వడగట్టాలి. 
వడగట్టిన సూప్‌లో ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. చివరిగా స్టవ్ ఆపివేసిన తర్వాత నిమ్మరసం కలిపి తాగాలి. ఈ సూప్‌ను గోరు వెచ్చగా తాగాలి. కావాలంటే పైన కొత్తిమీర లేదా కొద్దిగా తురిమిన అల్లం వేసుకోవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం, భోజనానికి ముందు ఈ సూప్ తాగడం వలన చర్మంలో అద్భుతమైన మెరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  థ్రెడింగ్ ఇంకా వాక్సింగ్ మధ్య ఎంతో తేడా ఉంది.. అదేంటో మీరూ తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు