/rtv/media/media_files/2025/04/16/XukRoDmogIWCXuoqS5g2.jpg)
eat sitting on bed
Sitting: మన పూర్వీకులు చెబుతూ వచ్చిన అనేక నిబంధనల వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం దాగి ఉంటుంది. జీవితాన్ని సవ్యంగా కొనసాగించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి కొన్ని ఆచారాలు, అలవాట్లు చాలా అవసరం. వీటిని పాటించడం వల్ల మనం అనేక రకాల శారీరక మరియు మానసిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా మన అమ్మమ్మలు చిన్ననాటి నుంచే కొన్ని పనులను చేయవద్దని పలు మార్లు హెచ్చరిస్తూ ఉంటారు. వాటిలో మంచం మీద కూర్చొని భోజనం చేయడం ఒకటి. ఇది చాలామందికి ఓ చిన్న విషయం అనిపించవచ్చు కానీ, దీని వెనుక గల కారణాలు చాలా లోతుగా ఉంటాయి. మన శాస్త్రాలు, ఆచారాలు అన్నీ కూడా క్రమశిక్షణ, గౌరవం, పరిశుభ్రతలపై దృష్టి సారిస్తాయి.
ఆరోగ్యపరంగా..
పెద్దలు తినడానికి ముందు ఆహారానికి నమస్కరించడం, ప్లేట్‌ను శుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు కూడా ఆహార పట్ల గౌరవాన్ని వ్యక్త పరుస్తాయి. మంచం నిద్రించేందుకు ఉపయోగించే స్థలం, అది విశ్రాంతికోసం ఉద్దేశించబడింది. అటువంటి ప్రదేశంలో భోజనం చేయడం వల్ల ఆహారాన్ని అవమానించినట్లుగా భావించబడుతుంది. అది వరకే అపవిత్రతకు గురైన ప్రదేశం కావడం వల్ల, అక్కడ భోజనం చేయడం ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. జ్యోతిష శాస్త్ర దృష్టి కోణంలో చూస్తే, మంచం మీద భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి, రాహువు, బృహస్పతి గ్రహాలకు అసంతృప్తి కలుగుతుందని చెప్పబడింది. ఇది మన జీవితంలో శ్రేయస్సు, ధనం, ఆనందం వంటి అంశాలకు ప్రతికూలంగా పని చేస్తుందని విశ్వసించబడుతుంది. ఇటువంటి చెడు అలవాట్లు మన జీవితంలోని శుభతను తగ్గించగలవని మన పెద్దలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: మహిళల ఈ తప్పులు ప్రైవేట్ భాగాలకు హాని కలిగిస్తాయి
మరొక ముఖ్య కారణం ఆరోగ్యంతో కూడి ఉంటుంది. మనం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తినడం లేదా నేలపై సూలభ్యంగా కూర్చొని తినడం వలన శరీర స్థితి సరిగా ఉంటుంది. శరీరం నిటారుగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. కానీ మంచం మీద లేదా సోఫాలో వంగి కూర్చొని తినడంవల్ల ఆహారం నేరుగా కడుపులోకి వెళ్లకుండా, కొంతమేర శ్వాసనాళాన్ని తాకే ప్రమాదం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగించవచ్చు, జీర్ణక్రియను మందగించవచ్చు. అందువల్లే అమ్మమ్మలు ఇలాంటి అలవాట్లను తప్పించమంటారు. ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద అర్థాన్ని కలిగి ఉంటాయి. మన దైనందిన జీవితంలో చిన్నగా కనిపించే ఈ అలవాట్లే మన ఆరోగ్యాన్ని, శ్రేయస్సును నిలబెట్టే కీలక మూలాలవుతాయి. కనుక మన పూర్వీకుల మాటలను తేలికగా తీసుకోవద్దు, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో రాగులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?
( dinner | dinner-time | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)
ఇది కూడా చదవండి: డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగవచ్చా?