/rtv/media/media_files/2025/08/23/covid-vaccine-2025-08-23-12-49-28.jpg)
COVID Vaccine
కరోనా వైరస్ (COVID-19) దేశ్యవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తేలిసిందే. ఈ వైరస్‌ను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు శ్రమించి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వైరస్‌తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని, జీవితాలను కాపాడటంలో ఈ వ్యాక్సిన్‌లు ఒక కీలకమైన సాధనంగా మారాయి. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. సమాజాన్ని కూడా మహమ్మారి బారినుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే తాగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారి గురించి యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా మహమ్మారిని బూటకం..
దేశంలో ఆకస్మిక మరణాల పెరుగుదలపై యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్(covid-vaccine) ల ప్రభావం వల్లనే దేశంలో హఠాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. వయస్సుతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా గుండెపోటు, ఇతర కారణాలతో ప్రజలు చనిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు కుమ్మక్కై కరోనా మహమ్మారిని ఒక బూటకంగా చూపించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని డాక్టర్ బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. కరోనా కాలంలో సంభవించిన మరణాల కంటే ఇప్పుడు సంభవిస్తున్న మరణాలు రెట్టింపు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం మొగుడ్ని చంపిన భార్య.. భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు!
నిబంధనల ప్రకారం.. పూర్తిస్థాయిలో ప్రయోగ పరీక్షలు చేయకుండానే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు, థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపెనియా, పక్షవాతం, వివిధ రకాల క్యాన్సర్లు సంక్రమిస్తున్నాయని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోని ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆకస్మిక మరణాలు లేవని, పోస్ట్-కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. హఠాత్తు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ మరణాలకు గల కారణాలను అన్వేషించడానికి కూడా ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఈ మరణాల వెనుక ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగిన కరోనా వ్యాక్సిన్ ఒప్పందాల రహస్యం బయటపడుతుందనే భయమే కారణమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ణాటక మాదిరిగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆకస్మిక మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోతే మరణాలు మరింత పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో, యువతలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: విజయనగరంలో దారుణం.. పెళ్లయిన 8 నెలలకే దంపతుల మృతి