/rtv/media/media_files/2025/02/17/ItrMrADbsBu5wrkG7i7T.webp)
TG Crime
ఇటివల వివాహిత మహిళ తన భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి కుట్రలు పన్నుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ దారుణమైన సంఘటన సమాజంలో పంచని కాపురాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. భర్తపై ప్రేమ, నమ్మకం అనే బంధాలను పక్కన పెట్టి.. వివాహేతర సంబంధానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు అడ్డుగా ఉన్న భర్తను నిర్దాక్షిణ్యంగా అంతం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, అపార్థాలు ఎన్ని ఉన్నా.. వాటిని పరిష్కరించుకోవడానికి బదులు ప్రాణాలను తీసేంతటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన వెనుక కారణాలు, మానసిక సంఘర్షణలు ఉండవచ్చు. కానీ ప్రేమ, నమ్మకం వంటివి పోయి.. మోసం వంటి భావోద్వేగాలు చూపిస్తున్నారు. తాజాగా ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి సంచలన తీర్పు ఇచ్చింది.
హతమార్చి.. గుండెపోటని..
తన ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య.. ఆమె ప్రియుడికి భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నిందితులైన భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్‌లకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ ఘటన 2020లో జరిగింది. రేగులగూడెంకు చెందిన దేవేందర్, స్వప్న దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే స్వప్న అడవి ముత్తారానికి చెందిన పవన్ కళ్యాణ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధానికి భర్త దేవేందర్ అడ్డుగా ఉన్నాడని భావించిన స్వప్న, ప్రియుడితో కలిసి అతడిని హతమార్చేందుకు పథకం వేసింది. పథకంలో భాగంగా మద్యంలో విషం కలిపి దేవేందర్‌కు తాగించింది.
ఇది కూడా చదవండి: ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. భార్యను రెండో పెళ్లి చేసుకున్న సీఐ!
దేవేందర్ మృతి చెందిన తర్వాత గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే దేవేందర్ తండ్రి నరసయ్యకు తన కొడుకు మరణంపై అనుమానం కలిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్ కలిసి ఈ హత్య చేసినట్లు తేలింది. పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఈ సంచలన తీర్పు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవాలన్నందుకు.. చంపి ఏడు ముక్కలు చేసి బావిలోకి