/rtv/media/media_files/2025/09/05/ganesh-immersion-2025-09-05-16-27-24.jpg)
Ganesh Immersion
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు.. పదవ రోజు అనంత చతుర్దశి నాడు నిమజ్జనం(Ganesh Immersion) చేయబడతాడు. డప్పులు, వాయిద్యాలు, కోలాటాలు, భజనల మధ్య జరిగే ఈ నిమజ్జనం హైదరాబాద్‌లో ఒక పెద్ద పండుగలా అనిపిస్తుంది. అయితే.. ఈ ఆచారానికి పురాణాలు ఏం చెబుతున్నాయన్నది చాలా మందికి తెలియదు. మునీంద్రులు సూత మహర్షిని ఈ విషయం గురించి అడిగినప్పుడు ఆయన వెల్లడించిన విషయాలు వినాయక నిమజ్జనం యొక్క నిజమైన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. సాధారణ దృష్టితో చూస్తే మట్టితో చేసిన గణపతి విగ్రహం ఒక బొమ్మ మాత్రమే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు అది కేవలం మట్టి విగ్రహం కాదు పరబ్రహ్మ స్వరూపం.
నిమజ్జనం వెనుక ఆధ్యాత్మిక రహస్యం..
ఈ మట్టిలో ఉన్న ప్రతి అణువులో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. గణపతి(Lord Ganesh) ని మనం మంత్రాలతో ప్రాణప్రతిష్ట చేసి ఆరాధిస్తాం. ఇలా పవిత్రమైన మట్టి విగ్రహాన్ని పూజించిన తర్వాత దాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం. నిమజ్జనం అంటే కేవలం నీటిలో ముంచడం కాదు. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. ఒక అణువు విశ్వంలో కలిసిపోవడం. ఇది సృష్టి, స్థితి, లయ అనే త్రిమూర్తుల సూత్రాన్ని గుర్తు చేస్తుంది. ఈ సూత్రం పరబ్రహ్మకు కూడా వర్తిస్తుంది. మట్టితో చేసిన గణపతి విగ్రహం పరబ్రహ్మ యొక్క ఒక రూపం. ఈ విగ్రహాన్ని సముద్రం, నది, చెరువులో నిమజ్జనం చేసినప్పుడు అది తిరిగి మట్టిలో కలిసిపోయి.. పరబ్రహ్మ స్వరూపమైన భూమితో ఐక్యమవుతుంది. ఇది మనం వచ్చిన చోటికే తిరిగి చేరుకోవడాన్ని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!
ఈ కారణం చేతనే మన పూర్వీకులు పూజ తర్వాత వినాయకుడిని నిమజ్జనం(Ganesh Nimajjanam 2025) చేసే ఆచారాన్ని ప్రవేశపెట్టారు. మనం ఈ రోజు కూడా దానినే అనుసరిస్తున్నాం. అంతేకాకుండా గణపతి పూజలో ఉపయోగించే పత్రి, ఇతర వస్తువులకు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ భూదేవి ప్రసాదించినవి. వీటిని నిమజ్జనం చేయడం ద్వారా పరబ్రహ్మకు తిరిగి సమర్పించినట్లవుతుంది. ఈ తత్వాన్ని సర్వం ఈ శ్వరార్పణం అని సూత మహర్షి పేర్కొన్నారు. ఈ విధంగా గణేష్ నిమజ్జనం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. జీవితం యొక్క తాత్విక సారాంశాన్ని, సృష్టి, లయం యొక్క లోతైన అర్థాన్ని తెలియజేసే ఒక పవిత్రమైన ఆచారమని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఈ ఆలయాలు గ్రహణం రోజు కూడా ఓపెన్.. ఏపీలో కూడా ఓ స్పెషల్ టెంపుల్.. ఎక్కడో తెలుసా..?