Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ మార్పులు సహజమేనా?

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో మార్పులనేవి సహజమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో బరువు పెరగడం, జట్టు రాలిపోవడం, చర్మ రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఈ మార్పులు కనిపిస్తే ప్రమాదమేమి లేదని నిపుణులు చెబుతున్నారు.

New Update
pregnancy9

Pregnancy

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఆహార విషయంలో కోరికలు పెరగడం, శరీర బరువులో మార్పులు, శరీర ఆకృతిలో మార్పులు, హార్మోన్ స్థాయిలో మార్పులు రావడం వంటివన్నీ జరుగుతాయి. వీటితో పాటు జుట్టు పెరగడం, చర్మ రంగు మారడం వంటివి జరుగుతాయి. ఈ మార్పులు ఎందుకు వస్తాయి. ఈ మార్పులు రావడం సహజమేనా? వంటి విషయాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి:High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

జుట్టు పెరుగుతుందా?

చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలకు జుట్టు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం కురులు మాత్రమే కాకుండా శరీరంలో అవాంఛిత వెంట్రుకలు కూడా పెరుగుతాయట.

ఇది కూడా చూడండి:Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

చర్మ రంగు మారుతుందా?
కొంతమంది మహిళలకి పెళ్లయిన తర్వాత చర్మరంగు మారుతుంది. మరికొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో స్కిన్ గ్లోగా ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ ఈ సమయంలో కూడా అందరి చర్మం మెరుస్తూ ఉండదట. కొందరు మహిళల చర్మం ఈ సమయంలో నల్లగా మారుతుందట. మళ్లీ డెలివరీ తర్వాత నార్మల్ స్థితికి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

బరువులో మార్పులు?
గర్భధారణ సమయంలో బరువు పెరగడం కామన్. ఎందుకంటే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లి పౌష్టికాహారం తీసుకుంటుంది. దీంతో బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత బరువు తగ్గుతారు. కానీ మరికొందరు అలానే ఉండిపోతారు.

ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు