/rtv/media/media_files/2025/03/23/FDxEszRefLTuWhSuJZsg.jpg)
Gold Rate
Gold and Sliver Prices: బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం ధరలు దిగనంటే దిగమంటున్నాయి.ఈ ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,557 ఉండగా.. నేడు రూ.80,566కు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.87,880 కాగా.. నేడు రూ.87,890కు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.80,694 ఉండగా.. ఈరోజు రూ.80,703కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.88,030 కాగా.. ఇవాళ 88,040 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.. బంగారం ధర చాలా రోజులుగా లక్ష రూపాయలు దాటుతుంది అని అందరూ చెబుతున్నారు కానీ అది ఇప్పుడు నిజమే అని అనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా?.. అర్జెంట్‌గా ఇవి తినండి
అమెరికా సంక్షోభ ప్రభావం
బంగారం ధర ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే 1 లక్ష రూపాయలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా సుంకాల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. దీనికి తోడు అమెరికా ఆర్థిక సంక్షోభం మాంధ్యం దిశగా వెళ్లే అవకాశం ఉందని వార్తలు కొట్టి పారేయడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడి సాధనం కానుక ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెడుతుంటారు.
ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
ప్రస్తుత ధరల పరిస్థితి ఇది....
దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలను ఒకసారి చూస్తే బెంగళూరు- రూ.80,768, రూ.88,110, పుణె- రూ.రూ.80,703, రూ.88,040, అహ్మదాబాద్- రూ.80,813, రూ.88,160,భోపాల్- రూ.80,786, రూ.88,130, కోయంబత్తూర్- రూ.80,942, రూ.88,300, పట్నా- రూ.80,658, రూ.87,990, సూరత్- రూ.80,813, రూ.88,160, కోల్‌కతా- రూ.80,593, రూ.87,920, చెన్నై- రూ.80,942, రూ.88,300లుగా ఉంది. అదే సమయంలో వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి రూ.97,730 ఉండగా, ముంబైలో రూ.97,900కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ వెండి ధర రూ.98,050 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
హాల్ మార్కు తప్పనిసరి
కొంతమంది దుకాణదారులు నకిలీ హాల్ మార్కు ముద్ర వేసి బంగారు నగలు విక్రయిస్తుంటారు. హాల్ మార్క్ అనేది గుర్తింపు పొందిన కేంద్ర ప్రభుత్వ బిఐఎస్ సర్టిఫికెట్ కలిగిన సెంటర్లు మాత్రమే ఇస్తాయి. కనుక మీరు ఈ హాల్ మార్కును మీ సమీపంలోని బిఐఎస్ హాల్ మార్క్ సెంటర్ కు వెళ్లి పరీక్షించుకోవచ్చు. తద్వారా మీరు నష్టపోకుండా నాణ్యమైన బంగారాన్ని పొందే అవకాశం ఉంటుంది. బంగారం బరువు విషయంలో తరచు మోసాలు జరుగుతూ ఉంటాయి. . కొన్నిసార్లు ట్యాంపరింగ్ జరిగినటువంటి తూకం మెషిన్లతో బంగారం బరువు కొలుస్తుంటారు. ఇలా జరిగినప్పుడు మీకు ఒక గ్రాము తేడా వచ్చిన దాదాపు రూ. 90,000 నష్టం వచ్చే అవకాశం ఉంది. కనుక గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్ డివైజెస్ తో మాత్రమే బంగారం తూకం చేయాలి. ఇతర సాంప్రదాయ నాన్ ఎలక్ట్రానిక్ తూకాలతో బరువు చూడటం అనేది ప్రస్తుతం నిషేధించారు. ఒకవేళ ఎవరైనా అలా తూకం చూసినట్లయితే వెంటనే మీరు వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు.
Also Read: Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!