Telangana: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌పై ప్రభుత్వం కీలక తీసుకుంది. రూ.50 వేల రుణాలకు 100 శాతం, రూ.లక్ష లోపు 90 శాతం, రూ.1-2 లక్షలకు 80 శాతం, రూ.2-4 లక్షల యూనిట్లకు 70 శాతం రాయితీని పెంచింది.

New Update
Rajiv Yuva Vikasam Scheme

Rajiv Yuva Vikasam Scheme

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసే నిబంధనలపై తెలంగాణ సర్కార్‌ కీలక తీసుకుంది. మొత్తం నాలుగు క్యాటగిరీలుగా యూనిట్లను విభజించింది. రాయితీ నిధుల వాటాను పెంచేసింది. గతంలో అమలు చేసినటువంటి స్వయం ఉపాధి స్కీమ్స్‌ కన్నా మెరుగ్గా నిబంధనలు అమలు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Also Read: తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!

యూనిట్ల వ్యయం, రాయితీ వాటాను ఈ సమీక్షలో ఖరారు చేశారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) వర్గాలకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆదివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కీమ్‌కు సంబంధించిన రూల్స్ అన్నికూడా సోమవారం జారీ కానున్నాయి.  

Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?

స్వయం ఉపాధి స్కీమ్స్‌ కింద చిరువ్యాపారాలు చేసేవాళ్ల కోసం ప్రభుత్వం రూ.50 వేల రుణ పథకాన్ని అమలు చేయనుంది. దీనిప్రకారం 100 శాతం రాయితీతో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయనుంది. రూ.లక్ష లోపు యూనిట్లకు ఇంతకుముందు 80 శాతం వరకు రాయితీ ఉండేది. ఇప్పుడు దాన్ని 90 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్ష లోపు యూనిట్ కోసం లబ్ధిదారుడు రూ.10 వేలు తన వాటా కింద చెల్లించాలి.  రూ.లక్ష నుంచి 2 లక్షల లోపు వ్యయం కలిగిన యూనిట్లకు 80 శాతం, రూ.2-4 లక్షల యూనిట్లకు 70 శాతం రాయితీని నిర్ణయించింది. 

Also Read: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!

Also Read: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు

rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు