Diabetes: డయాబెటిస్ ఉన్న తల్లి బిడ్డకు పాలివ్వొచ్చు.. కానీ ఈ జాగ్రత్తలు అవసరం

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఇది తల్లి పిల్లల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
mother breastfeed baby

mother breastfeed baby

Diabetes: నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో చెప్పలేం. జంక్‌ పుండ్‌, కల్తీ పదార్ధాలు, నాసిరకం ఫుడ్‌ తినటం వల్ల చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల భారీన పడుతున్నాడు. మహిళల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి ప్రతి నెల పీరియడ్‌ సమయంలో ఏదో రకంగా బాధపడుతుంటారు.  గర్భధారణ సమయంలో మహిళలకు అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిల్లో గర్భధారణ మధుమేహం కూడా ఒకటి. ఇది గర్భధారణ సమయంలో చక్కెర స్థాయి పెరిగే పరిస్థితి అంటారు. నిపుణుల పరిశోధన ప్రకారం..14 శాతం మంది మహిళలకు ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కొంతమంది మహిళల్లో ప్రసవం తర్వాత తగ్గితే మరికొందరికి గర్భం దాల్చిన తర్వాత మధుమేహం అలానే ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. అటువంటి సమయంలో డయాబెటిస్ ఉన్న తల్లి బిడ్డకు పాలివ్వగలదా..? లేదా..? అది బిడ్డకు ఏదైనా హాని కలిగించగలదా..? అనే డౌట్‌ కొందరికి వస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న తల్లి బిడ్డకు పాలివ్వొచ్చా.. లేదా అనేదానిపై కొన్ని విషయాలు  ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్న తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం లేదా గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు కూడా బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది బిడ్డకు మాత్రమే కాకుండా తల్లికి కూడా ప్రయోజనం ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి బాగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనితోపాటు మధుమేహం తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు బదిలీ కాదు. తల్లి పాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహంతో సహా అనేక వ్యాధుల నుంచి అతన్ని రక్షిస్తాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం

తల్లి పాలు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • తల్లిపాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె జబ్బులు, ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
  • తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకుండా ఎముకలు బలపడతాయి, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
  • తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది మధుమేహం, ఊబకాయం, ఇన్ఫెక్షన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక,   శారీరక పెరుగుదల మెరుగుపడుతుంది.
  • డయాబెటిస్ ఉన్న తల్లి పాలివ్వడానికి ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలి. తద్వారా స్థాయి తక్కువగా ఉంటే..వెంటనే ఏదైనా తినవచ్చు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు, తరచుగా పాలు ఇస్తుంటే.. తనతో స్నాక్స్ ఉంచుకోవాలని గుర్తుంచుకోవాలి.
  • డయాబెటిస్ ఉన్న తల్లి ఒత్తిడిని తగ్గించుకోవాలి, తల్లి పాలివ్వడం, రక్తంలో చక్కెర రెండింటికీ మంచి మానసిక ఆరోగ్యం ముఖ్యం. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి, శరీరానికి హైడ్రేటెడ్‌గా ఉంచుకోవటంతోపాటు పాలిచ్చేటప్పుడు రొమ్ము ఇన్ఫెక్షన్ కోసం తనిఖీ చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: షాహి పనీర్ తింటే పీడకలలు వస్తాయి

Latest News)

Advertisment
తాజా కథనాలు