Smart Phone: స్మార్ట్‌ ఫోన్లతో నిఘా.. ఎలా రక్షించుకోవాలి..?

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌లోని బ్యాటరీ వినియోగం, పనితీరు, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌పై స్పైవేర్‌ ప్రభావం చూపుతుంది. స్పష్టమైన గుర్తింపు ఉన్న యాప్‌లను వాడాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Smart Phone

Smart Phone

Smart Phone: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్‌లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. అయితే.. వీటిని గూఢచారులు తమ స్వలాభం కోసం ఉపయోగిస్తున్నారనే వాస్తవం చాలా మందికి తెలియదు. సైబర్‌ నేరగాళ్లు స్పైవేర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మన ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. మనం మెసేజ్‌లు పంపినా, ఎక్కడ ఉన్నా, బ్యాటరీ స్థితి, ఫోటోలు, వీడియోలు చూసినా అన్నీ సైబర్‌ నేరగాళ్లు తెలుసుకోగలుగుతున్నారు. దీని ద్వారా మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోంది.

స్పైవేర్ ఎలా పనిచేస్తుంది..?

సాధారణంగా స్పైవేర్ సాఫ్ట్‌ వేర్‌లను ఇతర అప్లికేషన్‌లలో కలిపి తయారు చేస్తారు. ఇవి యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అనుమానాస్పద లింక్‌లు, ఈమెయిల్స్, మెసేజ్‌ల ద్వారా కూడా ఈ సాఫ్ట్‌ వేర్‌లు మన ఫోన్‌లలోకి వస్తాయి. ఒకసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇది మీ ఫోన్‌ను హ్యాకర్ల నియంత్రణలోకి తీసుకుంటుంది. ఫోన్‌లోని బ్యాటరీ వినియోగం, పనితీరు, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌పై స్పైవేర్‌ ప్రభావం చూపుతుంది. మీరు మొబైల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. స్పైవేర్ ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. స్పైవేర్‌ను గుర్తించడానికి యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడాలి.

ఫోన్‌లో గమనించాల్సిన లక్షణాలు:

ఇది కూడా చదవండి: 
తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు

ఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే.. అది అసాధారణంగా వేడెక్కుతుంటే, లేదా తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్ అయి ఉంటే స్పైవేర్‌ ఉన్నట్లు అనుమానించాలి. స్పైవేర్‌ ద్వారా ఫోన్‌ కనెక్ట్ అయి ఉన్నప్పుడు.. డేటా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఫోన్‌ స్లోగా పనిచేయడం, క్రాష్ అవ్వడం, తెలియని వాట్సాప్ మెసేజ్‌లు లేదా ఇతర మెసేజ్‌లు రావడం, అనుమానాస్పద కాల్‌లు, కొత్త యాప్‌లకు అనుమతి ఇవ్వడం, అసాధారణమైన పాప్‌అప్‌లు వంటివి స్పైవేర్‌ ఉన్నట్లు సూచిస్తాయి.

నివారించే విధానం..?

ఇది కూడా చదవండి: 
నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే

మీ ఫోన్‌ను స్పైవేర్‌ నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ స్పష్టమైన గుర్తింపు ఉన్న యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం సురక్షితం కాదు. ఈమెయిల్, మెసేజ్, సోర్స్‌ల లింక్‌లను క్లిక్ చేయకూడదు. కొత్త వెర్షన్లలోని సాఫ్ట్‌ వేర్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయాలి. యాంటీవైరస్ అప్లికేషన్లు ఎల్లప్పుడూ ఇన్‌స్టాల్ చేయాలి. మీ మొబైల్‌ను విక్రయించేటప్పుడు.. దానిని ఫ్యాక్టరీ రీసెట్ చేసి.. మెమొరీని శుభ్రంగా చెరిపి వేయాలి. తెలియని వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే సైబర్‌ నేరగాళ్ల నుంచి  కొంత వరకైనా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చదవండి: చేతి వేళ్లల్లో కాలేయం సమస్య సంకేతాలు.. మీ గోళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా.?

smart-phone | new-smart-phone | Latest News)

ఇది కూడా చదవండి:
IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?


Advertisment
తాజా కథనాలు