/rtv/media/media_files/2025/10/20/goddess-lakshmi-and-basil-plant-2025-10-20-08-17-33.jpg)
Goddess Lakshmi and Basil Plant
సాధారణంగా ప్రతి హిందూ గృహంలో తులసి మొక్క(basil-plant) (పవిత్ర తులసి) ఉంటుంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. కానీ మారుతున్న శీతోష్ణస్థితి ప్రభావం మనుషులపైనే కాక మొక్కలపైనా ఉంటుంది. చలికాలంలో తులసి మొక్క వాడిపోకుండా, పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరి. చిన్నపాటి అజాగ్రత్త కూడా మొక్క చనిపోయేందుకు దారితీయవచ్చు. అందుకని శీతాకాలంలో తులసి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తులసి సంరక్షణ చిట్కాలు:
అతిగా నీరు పోయడం: చలికాలంలో తులసి మొక్కకు అతిగా నీరు పోయడం మంచిది కాదు. అధిక తేమ కారణంగా వేర్లు కుళ్ళిపోయి, మొక్క క్రమంగా ఎండిపోతుంది. నీరు పోసే ముందు మట్టిని పరిశీలించాలి. అవసరాన్ని బట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
మొక్కను కప్పండి:చలికాలంలో ముఖ్యంగా రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉంటుంది. ఇది మొక్కకు హాని చేస్తుంది. అందుకే తులసి మొక్కను మందపాటి గుడ్డతో కప్పడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మంచు ప్రభావం నుంచి రక్షించి.. చలిలో కూడా మొక్క పచ్చగా ఉంటుంది.
వేపాకు నీరు స్ప్రే:తులసి మొక్క ఆకులను తాజాగా ఉంచడానికి.. పురుగుల నుంచి రక్షించడానికి వేపాకు నీటిని స్ప్రే చేయాలి. ఇంట్లో పటిక ఉంటే.. దానిని కూడా నీటిలో కలిపి స్ప్రే చేయడం వలన మరింత రక్షణ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచేందుకు చక్కటి చిట్కాలు!
వాడిన ఆకులు తొలగించాలి: చలికాలంలో తులసి ఆకులు త్వరగా వాడిపోతుంటాయి. మొక్క బాగా పెరగడానికి.. వాడిపోయిన ఆకులను అలాగే చిగురు మొగ్గలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
సూర్యకాంతిపై శ్రద్ధ:చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా లభించక మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి తులసి మొక్కకు ప్రతిరోజూ సరిపడా సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. మొక్క నీడలో ఉంటే.. దానిని సూర్యరశ్మి పడే చోటుకు మార్చాలి. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తులసి మొక్కను శీతాకాలమంతా పచ్చగా, ఆరోగ్యంగా ఉంచవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ మొక్కను నాటండి.. అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి!!