/rtv/media/media_files/2025/10/20/crassula-2025-10-20-07-39-15.jpg)
Crassula
దీపావళి పండుగ(Diwali 2025) సంతోషం, వెలుగులు, సంపదకు ప్రతీక. ఈ రోజున ప్రతి ఇంటికీ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఐశ్వర్యం, సుఖశాంతులు నిరంతరం ఉండాలని కోరుకుంటారు. అయితే దీపావళి రోజున కొన్ని ప్రత్యేకమైన మొక్కలను(plants) నాటడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందవచ్చని వాస్తు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మొక్కలను లక్ష్మీ ఆకర్షణ మొక్కలుగా పరిగణిస్తారు. ఇవి ఇంటికి అందాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక శ్రేయస్సును, సానుకూల శక్తిని తీసుకువస్తాయని చెబుతున్నారు. దీపావళి రోజున ఏ మొక్కలను నాటలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రహస్యం మొక్కలు:
తులసి:హిందూ ధర్మంలో తులసిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి ఉన్న చోట లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారని నమ్ముతారు. దీపావళి రోజున తులసిని నాటి పూజించడం శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. తులసిని తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం మంచిది.
మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌ను నాటడం అదృష్టం, సంపదకు సంకేతం. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని స్థిరంగా ఉంచుతుందని.. ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున నాటితే ఆర్థిక వృద్ధి, వ్యాపారంలో పురోగతి లభిస్తాయి. ఆగ్నేయ దిశలో నాటడం అత్యంత శుభకరం.
ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ నాడు దీపం వెలిగించడంతోపాటు ఈ 4 పనులు చేయండి.. మీకు డబ్బే డబ్బు!!
క్రాసులా (Crassula): ఫెంగ్ షూయీ ప్రకారం.. ఈ మొక్కను డబ్బును ఆకర్షించే అయస్కాంతంగా చెబుతారు. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్‌గా ప్రవేశిస్తుందని నమ్మకం. ఈ మొక్కకు తక్కువ సంరక్షణ అవసరం. దీని మందపాటి ఆకులు శ్రేయస్సుకు చిహ్నం. కార్యాలయం లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీనిని ఉంచడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
శంఖపుష్పి (Shankhpushpi):దీపావళికి నాటడం శుభప్రదంగా భావించే ఈ మొక్కకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుంది.
తామర-అరటి :తామర, అరటి మొక్కలు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి చాలా శుభప్రదమైనవి. లక్ష్మీదేవి తామరపువ్వుపై కొలువై ఉంటుంది కాబట్టి తామర మొక్కను నాటడం అత్యంత అదృష్టంగా భావిస్తారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా, తామరను ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీపావళి రోజున ఈ మొక్కలను నాటి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ధన్‌తేరస్ నాడు ఈ 8 వస్తువులను ఇంటికి తెస్తే.. ఏడాదంతా మీకు లక్ష్మీ దేవి కటాక్షం!