Lord Shiva: శివుడికి అత్యంత ఇష్టమైన సమయం.. నేడు ఈ టైమ్‌లో పూజ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరడం ఖాయం!

ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం నిర్వహించి భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. అయితే సూర్యాస్తమయం తర్వాత గంట పన్నెండు నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా గుర్తిస్తారు. నేడు సోమవారం కావున ఈ సమయంలో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి.

New Update
Maha Sivaratri 2025

Sivudu

సోమవారం నాడు శివుడిని(lord-shiva) ఎంతో భక్తితో  పూజిస్తారు. అయితే ఎక్కువ మంది ఉదయం సమయాల్లో శివాలయానికి వెళ్తుంటారు. కానీ ఈ సమయంలో  కంటే ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు అన్ని శివుడు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. అయితే ప్రదోష కాలం అంటే ఏంటి? ఈ సమయంలో ఎలా పూజలు నిర్వహిస్తే శివుడు వరాలు ఇస్తాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Weekly Horoscope: ఈ రాశులు మట్టి పట్టినా బంగారమే.. ఈ వారం అదృష్టం పట్టబోతున్న రాశులివే!

ప్రదోష కాలం అంటే ?

ప్రదోషం(Pradosha time) అంటే పాపాలను తొలగించే సమయం అని అర్థం. అయితే ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత శుక్ల పక్షం, అమావాస్య తర్వాత కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష కాలం అని అంటారు. అలాగే రోజూ సూర్యాస్తమయం తర్వాత గంట పన్నెండు నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా గుర్తిస్తారు. ఈ సమయంలో శివుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తాండవం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శివుడిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందట. ఈ సమయంలో పూజలు నిర్వహించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు, కర్మ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ప్రదోషం అనే పేరులోనే పాపాలను తొలగించడం అనే అర్థం ఉంది. ఈ సమయంలో శివనామం జపించడం, అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు.

శ్రేయస్సు లభిస్తుందని..

వీటితో పాటు భోగ భాగ్యాలు, ధనం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని, జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని పండితులు అంటున్నారు. ఎలాంటి కోరికలు అయినా కూడా ఈ పవిత్రమైన సమయంలో తీరిపోతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు ఈ ప్రదోష సమయంలో డైలీ శివుడిని పూజిస్తే పెళ్లి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల విముక్తి పొందుతారని పండితులు అంటున్నారు. శివుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్నింట్లో విజయం పొందుతారు. శివుడిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

ఇలా పూజిస్తే ఫలితం

ప్రదోష తిథి రోజున ఉపవాసం ఉండాలి. ఇలా ఉండలేని వారు పాలు, పండ్లు వంటివి తీసుకోవాలి. సాయంత్రం పూట స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి శివుడిని పూజించాలి. పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార, గంధం, బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే కోరిన కోరికలు అన్ని కూడా శివుడు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. వీటికి సంబంధిత నిపుణులని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: September Horoscope: సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!

Advertisment
తాజా కథనాలు