/rtv/media/media_files/2025/09/01/lunar-eclipse-2025-09-01-09-18-25.jpg)
Lunar Eclipse
చంద్రగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా లేదా పాక్షికంగా భూమి నీడలోకి వస్తాడు. దీనివల్ల చంద్రుడు కాంతివిహీనంగా లేదా ఎర్రటి రంగులో కనిపిస్తాడు. ఈ అరుదైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. అయితే.. భారత కాలమానం ప్రకారం.. 2025 సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటల నుంచి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 గంటల వరకు పౌర్ణమి నాడు ఖగోళ అద్భుతం సంభవిస్తుంది.
గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది:
ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం దాదాపు 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగుతుంది. రాత్రి 11:42 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండాలలోని కొన్ని ప్రాంతాల నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరుతో సహా అనేక ప్రధాన నగరాల్లో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం, కుంభ రాశిలో సంభవిస్తోంది. ఈ కారణంగా ఇది కుంభ, సింహ, మీన, మిథున రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు. ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా!! అయితే ఈ వ్యాధి మీకుందేమో చెక్ చేసుకోండి
గ్రహణ సూతక కాలం 12:57 PM కి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సనాతన ధర్మాన్ని అనుసరించేవారు భోజనం చేయడం, పవిత్ర కార్యక్రమాలు చేయడం వంటివి నివారించాలి. గర్భిణీ స్త్రీలు, రోగులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదం. దుర్గాదేవిని పూజించడం, రాహు మంత్రం జపించడం, వెండి దానం చేయడం వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేశారు. ఈ కాలంలో ఆలయాలను మూసివేస్తారు.. మరుసటి రోజు ఉదయం శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత తెరుస్తారు. గ్రహణం తర్వాత స్నానం చేసి దర్భలను ఇల్లు, దేవాలయాలు, నిల్వ చేసిన ఆహార పదార్ధాలపై ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. వీటి నివారణకు సంబంధిత నిపుణులని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఔషధం శరీర భారాన్ని తగ్గిస్తుంది.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో అద్భుతం