/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope
ఆగస్టు 31 ఆదివారం నుంచి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం వరకు కొన్ని రాశుల వారికి ఏది పట్టిన బంగారమే. ఎలాంటి పని తలపెట్టినా అందులో విజయమే లభిస్తుంది. అయితే ఆ రాశులేవో ఈ వారం వారఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా కూడా విజయం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్నంత గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో అయితే లాభాలు వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కాకపోతే అప్పులకు దూరంగా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు.
వృషభం
గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కాస్త బయటపడతారు. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఇంకా మంచిది. జీవిత భాగస్వామి, బంధువుల నుంచి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతీ విషయానికి కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి.
మిథునం
ఈ రాశి వారికి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. అన్ని విధాలుగా మద్ధతు లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం
చిన్నగా ప్రయత్నించిన ఏదైనా కూడా వీరికి విజయాన్ని అందిస్తుంది. వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి వీరికి పూర్తి మద్ధతు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
సింహం
అష్టమ శని వల్ల ఈ రాశి వారికి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఒత్తిడి, శ్రమకు లోనవుతారు. అలాగే ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అవసరం లేకుండా అప్పులు చేయవద్దు. ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు.
కన్య
ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు రావచ్చు. ఏ పని మొదలు పెట్టినా కూడా విజయం పొందుతారు. అలాగే ఏం కోరుకున్న తీరుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఆర్థికంగా కొన్ని విషయాల్లో సమస్యలు ఉంటాయి. ఎవరినని నమ్మకుండా ఈ సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల
గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రారంభించిన అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వృశ్చికం
ఈ వారం కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు కొద్దిగా నెమ్మదిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇచ్చి ఇబ్బందుల్లో పడకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ధనుస్సు
జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి మంచి శుభవార్త వింటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ విషయాలను చక్కదిద్దడంలో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన మంచి సమాచారం అందుతుంది.
మకరం
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లోనూ, బయట కూడా పని భారం, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కష్టానికి తగిన లాభాలు పొందుతారు. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి లేదా వాహన సౌకర్యాల విషయంలో ఇబ్బందులు రావచ్చు.
కుంభం
గురువు, రవి, బుధ గ్రహాల అనుకూలత వల్ల అన్ని రంగాల వారికి ఈ వారం మంచి సమయం. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు.
మీనం
ఈ రాశి వారికి ఈ వారంతా అదృష్ట ఫలితాలు ఉన్నాయి. ఏ పని చేపట్టినా అది బంగారం అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింట్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది.. దాన్ని పొదుపు చేసుకోవాలి. అన్ని విధాలుగా ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.