శీతాకాలం ప్రారంభమైంది. చలికాలంలో చల్లగాలి వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. ఎన్ని లోషన్‌లు చర్మానికి అప్లై చేసిన కూడా పగుళ్లు వస్తాయి. చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసిన కూడా కొంత సమయానికే పొడి బారుతుంది. అదే సహజంగా ఉండే చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం. ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు సహజంగా ఉండే పదార్థాలను.. మహిళలు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే రకరకాల ప్రొడక్ట్స్ ఫేస్‌కి రాయక్కర్లేదు. సహజంగా ఉండే పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ముఖం పగుళ్లు రాకుండా ఉండాలంటే దానిమ్మ రసం జ్యూస్‌ను చర్మానికి అప్లై చేయాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ జ్యూస్‌ను అప్లై చేస్తే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! దానిమ్మ గింజల్లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరిపిస్తాయి. అయితే కేవలం దానిమ్మ రసాన్నే కాకుండా ఇందులో పెరుగు, పసుపు, శనగపిండి కలిపి కూడా చర్మానికి అప్లై చేయవచ్చు. దాదాపుగా ఒక నెల రోజుల పాటు వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయడం వల్ల మీ ముఖం ఎలాంటి పగుళ్లు, మచ్చలు లేకుండా క్లియర్‌గా ఉంటుంది. ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్