Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఇన్‌స్టాంట్ కాఫీని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా వాడే అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం ఇందులో ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
coffee

ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీ తాగకపోతే కొందరికి అసలు డే కూడా స్టార్ట్ కాదు. పొద్దున్న కాఫీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారని కొందరు డైలీ తప్పకుండా తాగుతారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ సమయంలో కాఫీ చేసుకునే తీరిక లేకపోవడంతో ఇన్‌స్టెంట్ కాఫీ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

టైప్ 2 డయాబెటిస్ కూడా..

ఈ కాఫీలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి మంచి చేస్తుందని భావిస్తారు. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టాంట్‌గా తయారయ్యే కాఫీ తాగడం వల్ల జీవక్రియ దెబ్బతినడంతో పాటు మతిమరుపు, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యల బారిన పడితే మళ్లీ క్లియర్ చేసుకోవడం కష్టమే.

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

ఈ ఇన్‌స్టాంట్ కాఫీలో ఎక్కువగా ప్లాస్టిక్ తయారీలోఅనే రసాయనం ఉంటుంది. దీన్ని ఎక్కువగా ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ఇలాంటి రసాయనం శరీరంలోకి వెళ్లడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాఫీని అసలు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు బేక్డ్ ఫుడ్స్‌లో కూడా ఎక్కువగా ఈ  ఇన్‌స్టెంట్ కాఫీని వాడుతుంటారట. దీనివల్ల కూడా మీకు తెలియకుండా శరీరంలోకి ఈ అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు