ఒక నెల రోజులు షుగర్ తినడం మానేస్తే?

నెల రోజుల పాటు షుగర్ తినడం మానేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. వీటితో పాటు మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. పంచదారకు బదులు తేనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Sugar

Sugar

ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగడానికి తప్పకుండా వాడుతారు. షుగర్ లేకుండా అయితే అసలు తీసుకోరు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రోజులో ఎంతో కొంత షుగర్ తీసుకుంటారు. అయితే పూర్తిగా నెల రోజుల పాటు పంచదార తినడం మానిస్తే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

గుండె పోటు వచ్చే ప్రమాదం..

పంచదారతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే చర్మం పాడవదు. ఎక్కువగా షుగర్ తింటే చర్మంపై ముడతలు వస్తాయి. పంచదారకు బదులు తేనె వాడటం బెటర్. పంచదార వల్ల బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు కొందరికి మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

హ్యాపీ హార్మోన్స్‌ డోపమైన్, ఎండార్ఫిన్ల విడదలను ఆపుతుంది. దీంతో నిరాశగా ఉంటారు. చక్కెరలోని యాసిడ్ నోటిలో బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల నోటి చివర్లలో పగుళ్లు వస్తాయి. అదే షుగర్ తీసుకోకుండా ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీపి ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్‌కి గురవుతారు. అదే పూర్తిగా షుగర్ మానస్తే.. డిప్రెషన్ నుంచి బయటపడతారు. కాబట్టి ఒక నెల రోజుల పాటు షుగర్ తినడం మానేయండి. శరీరంలో వచ్చే మార్పులు మీరే చూస్తారు.

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు