Night Walking: రాత్రి ఈ పని అలవాటు చేసుకుంటే చాలా వ్యాధులు పరార్

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రక్తపోటు, అధిక బరువు, గుండె, నిద్రలేమి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే.. తిన్న వెంటనే నడవకుండా 30 నిమిషాల తర్వాత నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Night Walking

Night Walking

నేటి జీవనశైలి (Life Style) చెడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా.. ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధుల కేసులులో వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక శరీరం వ్యాధులకు గురవుతారు. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే.. అది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి భోజనం (Night Food) తర్వాత కొంత సమయం క్రమం తప్పకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రారం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కొన్ని అడుగులు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ అలవాటు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Also Read :  ఈ ఐదు ఆహారాలతో కాలేయం సేఫ్‌.. ఆరోగ్యంగా ఉండాలంటే..!!

Also Read :  ఈ టిప్స్ పాటిస్తే ఎలాంటి మొటిమలైనా మాయం.. ఓ సారి ట్రై చేయండి!

నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • రాత్రి భోజనం తర్వాత నడవడం (Walking) వల్ల కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది. బరువు తగ్గాలనుకుంటే.. భోజనం తర్వాత నడవడం మంచి ఎంపిక.
  • రాత్రిపూట నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది రక్తపోటును తగ్గించి.. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. గుండెను బలపరుస్తుంది. నడక గుండెను ఆరోగ్యంగా ఉచుతుంది. 
  • నడక ఒత్తిడిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల మంచినిద్ర వస్తుంది. నిద్ర, నిద్రలేమి సమస్య ఉంటే నడవడం మంచిది.
  • తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు తేలికగా, హాయిగా ఉంటుంది. అయితే.. తిన్న వెంటనే నడవకుంట 30 నిమిషాల తర్వాత నడవాలి.  ఎక్కువసేపు నడవకుండ  20-30 నిమిషాలు నడవవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ రోగులకు అద్భుత నివారణ.. ఇంట్లో ఈ 4 ట్రై చేయండి

Also Read :  టమాటో రసం తాగితే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు