Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే

డైలీ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, బ్రోకలీ, సాల్మన్ ఫిష్ తింటే గోర్ల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. నెలకు ఒకసారి అయినా గోర్లను వేడి నీటితో శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి.

New Update
nails4

Nails

Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం డైలీ తీసుకునే ఫుడ్ గోర్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొందరు పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల గోర్లు పాడవుతాయి. ఇలా కాకుండా గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఐరన్ ఎక్కువగా ఉండే వాటిని..

ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే పాలకూర, బ్రోకలి(Lettuce, broccoli) తీసుకోవాలని సూచిస్తున్నారు. తినే ఫుడ్‌లో ఐరన్‌, ఫోలేట్‌, కాల్షియం, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి గోర్లు విరిగిపోకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. గోర్లు పెరుగుదలకు కెరోటిన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా చిలగడ దుంపల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు(Omega 3 fatty acids), ప్రొటీన్(Protein), విటమిన్ డి(Vitamin D), సెలీనియం(Selenium) వంటివి ఉండే సాల్మన్ చేపల(Salmon fish)ను కూడా తింటే గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. పోషకాలు లేని ఫుడ్ తీసుకుంటే గోర్లు బలహీనంగా తయారు అవుతాయి. కాబట్టి విటమిన్లు, ఫోలెట్లు ఉండే అవకాడోను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గోర్లను నెలకు ఒకసారి అయినా వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే గోర్ల సమస్యలు రావు.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

Advertisment
తాజా కథనాలు