Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

పూరీ జ‌గ‌న్నాథ్- గోపిచంద్‌ కంబోలో వచ్చిన "గోలిమార్" మూవీకు సీక్వెల్‌ రాబోతుంది,ఆల్రెడీ పూరీ స్క్రిప్ట్ వర్క్అంతా పూర్తి చేసినట్లు సమాచారం. 15 ఏళ్ల తరువాత ఈ ప్రాజెక్ట్‌ను మళ్ళీ బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Puri Jagannadh Golimaar Sequel

Puri Jagannadh Golimaar Sequel

Puri Jagannadh Golimaar Sequel: ఈ మధ్య పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నయి. ఇటీవల పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కించిన "లైగ‌ర్", "డ‌బుల్ ఇస్మార్ట్" మూవీస్ అయితే బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచాయి. అయితే ఎలా అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడు పూరీ. ఈ క్రమంలో, ఆయన కొత్త ప్రాజెక్ట్‌ గురించి కొన్ని ఆస‌క్తికర వార్తలు వస్తున్నాయి.

Also Read: AP Liquor Scam: సజ్జలకు బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ లో బిగుస్తున్న ఉచ్చు?

గతంలో పూరీ జ‌గ‌న్నాథ్, గోపిచంద్ కాంబోలో సూపర్ హిట్ అయిన చిత్రం "గోలిమార్" 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ పాత్రగా అద్భుతంగా నటించగా, ప్రియమణి కథానాయికగా అలరించారు. బెల్లంకొండ సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మాత. "గోలిమార్" మూవీ గోపిచంద్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

Also Read: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!.

సినిమా విడుదలై 15 ఏండ్లు...

ప్రస్తుతం ఈ సినిమా విడుదలై 15 ఏండ్లు గడిచిన తరువాత, పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సిద్దమయ్యారనే సమాచారం బ‌య‌టకు వచ్చింది. ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు కూడా తెలుస్తోంది. గోపిచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. మరోవైపు, అయితే ఈ సీక్వెల్‌ని కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Also Read: TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు