Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న!
పూణేలో 13 ఏళ్ల బాలికను తండ్రి, మేనమామ, కజిన్ అత్యాచారం చేసి బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది. స్కూలులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠం చెబుతుండగా.. జరిగిన విషయాన్ని టీచర్ కు చెప్పింది బాలిక. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాక్సో చట్టం కింద నిందితులను అరెస్ట్ చేశారు.