Anemia: జాగ్రత్త.! వీటిని తింటే ఐరన్ లోపం ఏర్పడుతుంది

రక్తహీనతతో భాదపడేవారు పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, ఆల్కహాల్, గ్లూటెన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి శరీరంలో ఐరన్ శోషణను నిరోధిస్తాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ లభించదు.

New Update
anemia

anemia

Anemia:  నేటి బిజీ లైఫ్ లో ఆరోగ్యంపై ప్రత్యేక ద్రుష్టి సారించాలి.  పరిశుభ్రత, ఆహరం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా  జబ్బుల బారిన ఖాయం. ముఖ్యంగా అమ్మాయిలు సరిగ్గా తినకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనతకు గురవుతూ ఉంటారు. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత వస్తుంది. దీని వల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి.  అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛపోవడం, తలనొప్పి, గుండె  వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పి, చేతులు, కాళ్ళు చల్లబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్

ఐరన్ శోషణను తగ్గించే ఆహారాలు 

ఇలాంటి పరిస్థితుల్లో తినే ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా ఇనుము శరీరంలో ఇనుము సరిగ్గా శోషించబడదు, దీనివల్ల ఇనుము లోపం ప్రారంభమవుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

టీ ,కాఫీ

టీ, కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో  ఇనుము స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధికంగా తీసుకోవడం ఇనుము శోషణ తగ్గిస్తుంది.  దీనివల్ల శరీరంలో ఇనుము స్థాయిలు తగ్గి.. రక్తహీనత  ఏర్పడుతుంది.

fever
fever

 

ఆల్కహాల్ - Alcohol

ఆల్కహాల్ తీసుకోవడం శరీరంలో ఇనుము లోపం ఏర్పడడం మాత్రమే కాదు..  అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరానికి ఆహారం ద్వారా లభించాల్సిన ఇనుము ఆగిపోతుంది. దీనికి తోడు లివర్, గుండె సమస్యలు తలెత్తుతాయి. 

పాల ఉత్పత్తులు - Milk Products

సాధారణంగా పాల ఉత్పత్తులు క్యాల్షియం లోపాన్ని తొలగిస్తాయి. కానీ అదే మిల్క్ ప్రాడక్ట్స్ ఇనుము శోషణకు సరైనవిగా పరిగణించబడవు. పాల ఉత్పత్తులలోని  కాల్షియం ఇనుము శోషణను నిరోధిస్తుంది. ఆల్రెడీ రక్తహీనతతో బాధపడుతున్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది. 

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

గ్లూటెన్ 

గ్లూటెన్ కంటెంట్ ఉన్న పదార్థాలను అధిక మొత్తంలో  తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము శోషణ తగ్గుతుంది.

మెడిసిన్ 

యాంటీబయాటిక్స్ వంటి కొన్ని మందులు శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్‌పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు