/rtv/media/media_files/2025/09/23/incontinence-2025-09-23-16-51-01.jpg)
Incontinence
నేటి కాలంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తరచుగా వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటారు. అంతేకాదు మలవిసర్జనను ఎక్కువ సమయం ఆపుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడేవారు ఉన్నారు. మలవిసర్జన సమస్యను ఆపలేకపోవడాన్ని ఫేకల్ ఇంకంటినెన్స్ లేదా బౌల్ ఇంకంటినెన్స్ అని అంటారు. ఇది తెలియకుండానే మలం లేదా గ్యాస్ బయటకు వచ్చే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సమస్య వృద్ధులలోనే కాకుండా అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. మలవిసర్జనను నియంత్రించే కండరాలు లేదా నాడులు బలహీనపడినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ ఇది వ్యాధి కాదు.. చికిత్సతో నయమయ్యే పరిస్థితి మాత్రమే. ఆయుర్వేదంలో దీనిని జీర్ణ సంబంధిత గృహణి దోషం సమస్య అంటారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS)కు సమానంగా ఉంటుంది. బలహీనమైన జీర్ణక్రియ శక్తి అంటే అగ్నిమాంద్యం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే ఆయుర్వేదంలో వాటిని ఎలా చికిత్స చేయాలో.. ఈ సమస్య గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తరచుగా వాష్‌రూమ్‌కి వెళ్లడం
క్రమరహిత ఆహారపు అలవాట్లు, అధికంగా వేయించిన, పాత ఆహారం తీసుకోవడం, అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక.. ప్రేగులలో కుళ్ళిపోయి, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. గృహణి దోషం ఉన్నవారిలో తరచుగా విరేచనాలు, మలంలో జీర్ణం కాని ఆహారపు పదార్థాలు, కడుపులో బరువుగా ఉండటం, ఆకలి లేకపోవడం, గ్యాస్, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తిన్న వెంటనే మరుగుదొడ్డికి వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ సమస్య వాట, పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల వస్తుంది. అందుకే ఆయుర్వేదం దీనిని నాలుగు రకాలుగా వర్గీకరించింది. వాత, పిత్త, కఫ, సన్నిపాత గృహణి. ఈ సమస్యకు ఆయుర్వేదం నిర్దిష్టమైన ఆహారం, మందులు, జీవనశైలి మార్పులను సిఫార్సు చేస్తుంది.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో ఈ ఆహారం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం
పెసల గంజి, మారేడు పండు షర్బత్, మజ్జిగ, జీలకర్ర నీరు వంటి తేలికపాటి ఆహారాలు చాలా మేలు చేస్తాయి. అధిక కారంగా ఉండే, వేయించిన, పాత ఆహారాలను పూర్తిగా మానేయాలి. యోగా, ప్రాణాయామం కూడా చాలా ప్రయోజనకరం. పవనముక్తాసన, వజ్రాసన, అగ్నిసార క్రియ, అనులోమ్-విలోమ్ ప్రాణాయామం వంటివి జీర్ణవ్యవస్థను బలపరిచి, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. సోంపు, వాము టీ, అల్లం రసం, తేనె, మజ్జిగలో పుదీనా వంటివి కూడా ఎంతో ఉపయోగపడతాయి. సమగ్ర చికిత్స, జీవనశైలి మార్పులతో గృహణి దోషాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:నీరు తక్కువ తాగడం కూడా ఒత్తిడికి కారణమని తెలుసా!!