Knee pains: ఈ ఆసనాలు వేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్!

కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రోజూ తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అసండిక, సీతాకోకచిలుక, వజ్రాసనము, మండూకాసనము వేయాలని నిపుణులు అంటున్నారు. కుర్చీ మీద కూర్చోని వేయవచ్చని చెబుతున్నారు.

New Update
Knee Pain

Knee Pain

మారిన జీవనశైలి వల్ల చాలా మంది కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కీళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే వేయాల్సిన ఆసనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

అసండిక ఆసనం

ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్ల సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. మీరు కూర్చీలో కొంత సమయం కూర్చోని ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్లు బలంగా మారతాయి.

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

సీతాకోకచిలుక
ఈ యోగా చేయడం వల్ల కూడా సీతాకోకచిలుకలా మోకాళ్లు ఉంటాయి. అయితే కూర్చుని రెండు పాదాల అరికాళ్లను కలిపి చేతులతో పట్టుకోండి. ఇప్పుడు మీ మోకాళ్లను సీతాకోకచిలుకలా కదిలించండి. ఈజీగా ఈ యోగా చేయడం వల్ల మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

వజ్రాసనము
ప్రతిరోజూ కొంత సమయం వజ్రాసన భంగిమలో కూర్చోవడం మోకాళ్ల సమస్యలు తగ్గిపోవడంతో పాటు ఫుడ్ ఈజీగా జీర్ణం అవుతుందని నిపుణులు అంటున్నారు. 

మండూకాసనము
ఈ ఆసనం వల్ల మోకాళ్లు, కండరాలు బలంగా తయారు అవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఒక 20 నిమిషాల పాటు ఈ ఆసనం వేయడం వల్ల ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు