Kidney Stones: కాఫీ, మాంసం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు అధికం అవుతాయా?

నేటి కాలంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు సోయాబీన్స్, సపోటా, ఎండు గింజలు, మినప్పప్పు, ముడి బియ్యం, వంకాయ, టమోటా, ఉప్పు, జంక్ ఫుడ్, నూనెను పదార్థాలు ఎక్కువగా తినకూడదని నిపుణులు చెడుతున్నారు.

New Update
Foods

Foods

Kidney Stones: మూత్రపిండాలు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇటీవలి కాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. అనారోగ్యకరమైన ఆహారం మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు దోహదం చేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి, రాళ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు ఏ ఆహారాలకు ఎందుకు దూరంగా ఉంటే మంచిదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

విటమిన్ సి ఆహారాలకు దూరం:

విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కావున వాటిని నిర్దిష్ట పరిమాణంలో తినాలి. కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు సోయాబీన్స్, సపోటా, ఎండు గింజలు, మినప్పప్పు, ముడి బియ్యం, వంకాయ గింజలు, టమోటా గింజలను ఎక్కువగా తినకూడదు. ఇవన్నీ రాళ్ల సమస్యను పెంచుతాయి. అంతేకాకుండా అధిక కెఫిన్ తీంటే తరచుగా మూత్రవిసర్జన జరిగి శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. శరీరంలో నీటి మట్టం తగ్గితే.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీ రోగులు బీట్‌రూట్, క్యారెట్లు, బంగాళాదుంపలు, పాలకూర వంటి కూరగాయలను తినకూడదు.  

 ఇది కూడా చదవండి: శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతోందని సూచించే లక్షణాలు ఇవే

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు నాన్-వెజ్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. ఇది కిడ్నీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారి శరీరంలో ప్యూరిన్ల పరిమాణం పెరుగుతుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. దీంతో కిడ్నీల్లో రాళ్ల పరిమాణం పెరుగుతుంది. అటువంటి రోగులు ముఖ్యంగా ఎర్ర మాంసం వినియోగానికి దూరంగా ఉండాలి. సోడియం అధికంగా ఉన్న ఆహారం, ఉప్పు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనెను కలిగి ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పికి ఈ హెర్బల్‌ టీ వరం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు