/rtv/media/media_files/2025/01/10/yoaM5OZ4ozZyoNKGH41F.jpg)
Kidney Stones
Kidney Issues: కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల వల్ల చాలా మంది వీటి బారిన పడుతున్నారు. వీటి నుంచి విముక్తి చెందాలంటే కొన్ని రకాల పండ్ల(Fruit Juics)ను డైలీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆ పండ్లు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం
ఆపిల్ పండ్లు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆపిల్ పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దానిమ్మ
దానిమ్మ పండ్లు లేదా జ్యూస్ తీసుకోవడం కిడ్నీ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు దానిమ్మ జ్యూస్, పండ్లను డైలీ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
పుచ్చకాయలు
వీటిలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. డైలీ చిన్న ముక్క అయినా తినడం వల్ల కిడ్నీ సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!
నారింజ
ఆరెంజ్‌లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. డైలీ ఒక ఆరెంజ్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు దరి చేరడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
బొప్పాయి
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.