Kartika Masam 2025: మరో 2 వారాల్లో కార్తీక మాసం స్టార్ట్.. ఈ పని చేస్తే మీకు అంతులేని పుణ్యం.. తప్పక తెలుసుకోండి!

ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్‌ 22న ప్రారంభమైన నవంబర్‌ 20 ముగుస్తుంది. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఆరోగ్య నియమాలకు అధిక ప్రాధాన్యత ఉంది. విష్ణువు, లక్ష్మి, గణేశుడు, సూర్యదేవుడు, ధన్వంతరిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి.

New Update
Kartika Masam 2025

Kartika Masam 2025

ఈ ఏడాది కార్తీక మాసం(Kartika Masam 2025) అక్టోబర్‌ 22న ప్రారంభం కానుంది. నవంబర్‌ 20 వరకు కార్తీక మాసం కొనసాగనుంది. పురాణాల ప్రకారం.. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఆరోగ్య నియమాలకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ధంతేరాస్, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛట్ పూజ, దేవ ఉత్థాన ఏకాదశి వంటి ముఖ్య పండుగలు వస్తాయి. పండితుల అభిప్రాయం ప్రకారం.. కార్తీక మాసం పేరు కార్తికేయ స్వామి పేరు మీద ఏర్పడింది. ఈ మాసంలో విష్ణువు, లక్ష్మి, గణేశుడు, సూర్యదేవుడు, ధన్వంతరిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో పాటించాల్సిన ముఖ్య నియమాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో ముఖ్య నియమాలు:

దీపారాధన: కార్తీక మాసంలో దీపదానం అత్యంత ముఖ్యమైనది. దేవాలయాలు, తులసికోట, ఉసిరి చెట్టు కింద, నదులు, చెరువుల వద్ద దీపాలు సమర్పించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది.

నదీ స్నానం:ఈ పవిత్ర మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించడం శ్రేయస్కరం. నదికి వెళ్లలేని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అదృష్టం, ఆరోగ్యం లభిస్తాయి.

ఆహార నియమాలు:కార్తీక మాసంలో శీతాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వేడి కుంకుమపువ్వు పాలు (Saffron Milk), కాలానుగుణంగా లభించే పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ఈ రోజుల్లో పప్పులు, పప్పు దినుసులు, వంకాయ, మజ్జిగ, కాకరకాయ తినకూడదు. శీతాకాలపు అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు దుంపలు ముల్లంగి, క్యారెట్, చిలగడదుంప తినడం మంచిది.

ఇది కూడా చదవండి: ఇంట్లో పసుపు కందిరీగ గూళ్లతో ఇబ్బందిగా ఉందా..? ఖరీదైన స్ప్రేలు అవసరం లేకుండా సులభమైన ఇంటి చిట్కాలు

దుస్తుల విషయంలో జాగ్రత్త:శరీరంపై బయటి చలి ప్రభావం పడకుండా తగిన దుస్తులు ధరించాలి. లేదంటే జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

నేలపై నిద్ర: పురాణాల ప్రకారం.. కార్తీక మాసంలో నేలపై పడుకోవడం వలన బద్ధకం తగ్గి, శారీరక సమస్యలు తొలగిపోతాయి.

ధన్వంతరి ఆరాధన:ఈ మాసంలో వైద్యదేవుడు పూజ చేయడం వలన అనారోగ్యాలు దూరమై ఆయుష్షు పెరుగుతుంది. అశ్వినీ పౌర్ణమి తర్వాత 12 రోజులకు ధంతేరాస్ నాడు అమృతం, ఔషధాలతో ధన్వంతరి దేవుడు ఆవిర్భవించారు.

మంత్ర జపం-ధ్యానం: ఈ మాసం జపం, ధ్యానానికి చాలా అనుకూలమైనది. తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఇష్ట దేవత మంత్రాలను జపించాలి. ఇది విల్‌పవర్‌తోపాటు అంతర్గత శక్తి పెరుగుతుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి:  స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలపై సబ్బు వాడకూడదా..? వచ్చే దుష్ప్రభావాలు ఇవే

Advertisment
తాజా కథనాలు