/rtv/media/media_files/2025/10/06/women-should-not-use-soap-2025-10-06-09-30-25.jpg)
women should not use soap
ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్నానం చేసేందుకు రకరకాల సువాసనలతో కూడిన సబ్బులను లేదా బాడీ వాష్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే స్నానం చేసేటప్పుడు శరీరం మొత్తం సబ్బు రుద్దుకోవడం మహిళలకు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. ముఖ్యంగా మహిళలు తమ వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మరియు ఏ భాగాలపై సబ్బు వాడకూడదో తెలుసుకోవాలి. సబ్బు, బాడీ వాష్ వాడకం సర్వసాధారణం అయినప్పటికీ.. మహిళలు తమ శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాల శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు ఏ శరీర భాగాలకు సబ్బు వాడకూడదు? దాని వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రైవేట్ భాగాలపై సబ్బు వాడకం వల్ల కలిగే నష్టాలు:
మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో యోని (Vagina) ఒకటి. దీనికి సరైన సంరక్షణ అవసరం. కొందరు మహిళలు స్నానం చేసేటప్పుడు యోనిని శుభ్రం చేయడానికి సబ్బును ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా మానుకోవాల్సిన అలవాటు. యోనిని సబ్బుతో శుభ్రం చేయడం వల్ల మన శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (Healthy Bacteria) నశించిపోతుంది. దీని ఫలితంగా యోని ఇన్‌ఫెక్షన్ల (Vaginal Infections) ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా సబ్బుల్లో ఉండే రసాయన పదార్థాలు ప్రైవేట్ భాగాల్లో చికాకు (Irritation) లేదా దురదను కలిగిస్తాయి. కాబట్టి శరీరం మొత్తం సబ్బు వాడినా, యోనిని సబ్బుతో కడగడం వెంటనే నిలిపివేయడం శ్రేయస్కరమని చర్మ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయడానికి సాధారణ నీరు (Plain Water) సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఉత్పత్తులను (Intimate Washes) కూడా ఉపయోగించవచ్చు. అయితే వీటిని కేవలం యోని బయటి ఉపరితలంపై (Outer Surface) మాత్రమే ఉపయోగించాలి. లోపలి భాగాలను నీటితో మాత్రమే శుభ్రం చేయాలి. రుతుస్రావం (Period) సమయంలో కూడా ఇదే పద్ధతిని పాటించాలి. ఈ సమయంలో లోపలి భాగాల్లో ఏ ఉత్పత్తిని వాడినా చికాకు కలిగే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన నీటితో సున్నితమైన భాగాలను శుభ్రం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఖరీదైన ఫేషియల్స్‌తో పనిలేదు..ఇంట్లోనే ముఖం మెరిపించే సులభ చిట్కాలు