Rings with God : దేవుడి ప్రతిమతో ఉన్న ఉంగరాలు పెట్టుకోవచ్చా? మంచిదా, చెడ్డదా?

కొందరు అక్షరాలతో, దేవుడి ప్రతిమతో, నక్షత్రాలతో, రాళ్లతో కూడిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.  అయితే మిగితావి ఎలా ఉన్నా  దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించవచ్చా లేదా అనే అనుమానాలుంటాయి.  ఇంతకీ ఇలా ఉంగరాలు ధరించవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  

New Update
rings-with-god

చాలామందికి చేతికి ఉంగరాలు ధరించే అలవాటు ఉంటుంది.  కొందరైతే అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు.  సాధారణంగా అక్షరాలతో, దేవుడి ప్రతిమతో, నక్షత్రాలతో, రాళ్లతో కూడిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.  అయితే మిగితావి ఎలా ఉన్నా  దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించవచ్చా లేదా అనేది చాలా మందికి అనుమానాలుంటాయి. ఇంతకీ ఇలా ఉంగరాలు ధరించవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  

చేతికి దేవుడి బొమ్మలు ఉన్న ఉంగరాలను పెట్టుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. అయితే, వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు, పద్ధతులు పాటించడం ముఖ్యం.  దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించడానికి ముందు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించడం మంచిది. అప్పుడే వాటికి శక్తి వస్తుందని నమ్ముతారు. ఉంగరంలోని దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు చేతి గోళ్ల వైపు ఉండాలి. దేవుడి ఉంగరాలు ధరించినప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. వీటిని ధరించి అపరిశుభ్రమైన ప్రదేశాలకు వెళ్ళడం, అపరిశుభ్రమైన పనులు చేయడం వంటివి చేయకూడదు.

Also Read :  అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

Also Read :  గుండెల్లో మంటకు ఇంటి పద్ధతులతో తక్షణ ఉపశమనం

మహిళలు బహిష్టు సమయంలో

దేవుడి ఉంగరాలు ధరించి మాంసాహారం తినడం, మద్యపానం, ధూమపానం చేయడం వంటివి చేయకూడదు. ఒకవేళ ఇవి చేయాల్సి వస్తే, ఉంగరాన్ని తీసి జాగ్రత్తగా ఉంచడం మంచిది. మహిళలు బహిష్టు సమయంలో దేవుడి ఉంగరాలు, లాకెట్లు తీసి భద్రపరచుకోవాలి. ఆ సమయంలో వాటిని ధరించకూడదు. దేవుడి ప్రతిమలున్న ఉంగరాన్ని కుడి చేతికి ధరించాలి. ఎడమ చేతికి ధరించకూడదు.  దేవుడి ఉంగరాన్ని కేవలం ఒక ఆభరణంగా కాకుండా, దైవత్వాన్ని సూచించే పవిత్ర వస్తువుగా భావించి గౌరవంగా చూసుకోవాలి. ఇంట్లో దేవుడు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఒంటిపై దేవుడికి సంబంధించిన వస్తువులు ఉన్నా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.

Also Read :  ఆలయాల్లో మొబైల్ ఫోన్ వినియోగం ఎందుకు నిషేధమో తెలుసా..?

దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను కేవలం పూజల సమయంలో ధరించడం మంచిదని, రోజువారీ ధరించడం అంత మంచిది కాదని కొందరు అభిప్రాయపడతారు. అయితే, పూర్తి భక్తి, నియమ నిష్టలతో ధరిస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు.ఈ నియమాలను పాటించడం ద్వారా దేవుడి ఉంగరాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని శాస్ట్రం చెబుతుంది.  

Also Read :  అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

telugu-news | lord-ganesha | Rings with God | latest-telugu-news | today-news-in-telugu | Latest Life style news | daily-life-style | human-life-style | rings of power | lord-of-the-rings

Advertisment
తాజా కథనాలు