Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

New Update
Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో కొత్త సేల్‌తో ముందుకు వస్తుంది. ప్రైమ్ మెంబర్ల కోసం గతంలో జులై 12 నుంచి 14 వరకు "ప్రైమ్ డే సేల్" అమెజాన్ నిర్వహించింది. ఇప్పుడు అందరూ కూడా కొనుగోలు చేసేలా "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్" పేరుతో భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే అంటే జులై 31 సాయంత్రం నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

డిస్కౌంట్లు..

అంతేకాకుండా, పాత వస్తువులను మార్చుకునేందుకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వాయిదాల్లో కూడా కొనుగోలు చేసేందుకు ఈఎంఐ ఆఫర్లు కూడా ఉంటాయి. స్మార్ట్‌ ఫోన్‌లు, యాక్సెసరీలు, ల్యాప్‌ టాప్‌లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజ్‌లు వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. వీటితో పాటు కొన్ని వస్తువులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్స్, ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.  మీకు కావాల్సిన వస్తువులు అన్ని ఇందులో కొనుగోలు చేయవచ్చు. 

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

Advertisment
తాజా కథనాలు